2.0 టీజర్ : బాహుబలి తర్వాత మరో కొత్త లోకం లోకి…!

Thursday, September 13th, 2018, 04:55:51 PM IST

ఇప్పుడు భారతదేశ చిత్ర పరిశ్రమ చూపు అంతా ఒక వైపే.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “సూపర్ స్టార్ రజిని కాంత్” అద్భుత చిత్రాల సృష్టికర్త శంకర్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్న చిత్రం “2.0” యొక్క టీజర్ ని వినాయక చవితి కానుకగా నేడు ఉదయం 9 గంటలకి అటు యూట్యూబ్ లోను మరియు ఒక్క భారత దేశం లోనే దాదాపు 6000 వేలు పై చిలుకు థియేటర్లలో అన్ని భాషల్లో విడుదల చేశారు. ఇందులో 1000 థియేటర్లలో 3D లో విడుదల చేశారు.

అయితే ఈ టీజర్ ఎలా ఉంది అంటే.. ఇప్పటికే రాజమౌళి తన విజువల్ వండర్ బాహుబలితో మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు. శంకర్ రాజమౌళి కన్నా రెండు ఆకులు ఎక్కువే చదివాడు, విజువల్ ట్రీట్ ఇవ్వడం లో తన కన్నా శంకరే దిట్ట అని రాజమౌళియే ఒక ఫంక్షన్లో అన్నాడు. అందుకు తగ్గట్టు గానే ఈ చిత్రం టీజర్ కూడా అద్భుతంగా ఉంది. టీజర్ లో ప్రతి ఒక్క ఫ్రేమ్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. 2010లో విడుదల ఐన రోబో చిత్రాన్ని మించి ఈ చిత్రం ఉండబోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. హాలీవుడ్ స్థాయి చిత్రాలని మరిపించేలా ఈ టీజర్ ఉంది.దీనికి తోడు ఏ ఆర్ రెహమాన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్ కి ప్రాణం పోసింది. అయితే ఈ టీజర్ని ఇంతకు మునుపే దుబాయ్ లో ఒక ఫంక్షన్ లో వేసినపుడు లీక్ అయ్యిన సంగతి తెలిసినదే, ఆ టీజర్ని చూసేసిన వారికి మాత్రం పెద్ద కొత్తగా ఏమి అనిపించకపోవచ్చు, కానీ కొత్త గా చూసే వారికి మాత్రం ఒక అద్భుత లోకాన్ని చూసినట్టు ఉంటుంది. మన భారతీయ చిత్రాల్లో ఇలాంటి అద్భుత చిత్రాలు ఇంకా ఎన్నో రావాలి..

  •  
  •  
  •  
  •  

Comments