వైరల్ : బాబోయ్ గుడ్లు పెడుతున్న 14 ఏళ్ళ బాలుడు

Thursday, February 22nd, 2018, 05:00:30 PM IST

బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం సృష్టిలో నేడు జరుగుతున్న వింతలు చూస్తుంటే ఏమి జరుగుతుందో మన మనుగడ ఎటుపోతుందో అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ మరి కొందరేమో ఇటువంటి వింతల వల్ల మనిషి పరిశోధనలు పెరిగి మెదడుకు మరింత పని దొరుకుతుందని అభిప్రాయపడుతున్నారు.అయితే సృష్టిలో మరొకవింతను గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మనం ఇప్పటివరకు కొన్ని జంతువులైన కోళ్లు, బాతులు, ఇతర పక్షులు, అలానే కొన్ని రకాల ఇతర జంతువులు మాత్రమే గుడ్లు పెడతాయని విన్నాము.

కానీ, మనిషి గుడ్లు పెట్టడం ఎక్కడ విన్నది లేదు, కన్నది లేదు. అదే ఒక మనిషి గుడ్లు పెడితే అది వింతే అవుతుంది కదా మరి. అయితే ఈ వింత ఘటన ఇండియోనేషియా దేశంలో జరిగింది. ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14ఏళ్ల బాలుడు కోడి గుడ్ల లాంటి గుడ్లు పెడుతున్నాడని, గత మూడేళ్ల నుంచి అక్మల్ ఇలా గుడ్లు పెడుతున్నాడని అతని తండ్రి చెబుతున్నారు. ఇప్పటివరకు అతను 2015 నుండి మొత్తం 20 గుడ్లు పెట్టినట్లు ఆయన చెపుతున్నారు. ఈ విచిత్రమైన వ్యవహారంపై వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని లబోదిబో మంటున్నాడు.

చికిత్స నిమిత్తం డాక్టరు వద్దకు తీసుకెళ్లగా, మొదట ఇదంతా నమ్మని వైద్యులు వున్నట్లుండి వారి ముందే అక్మల్ రెండు గుడ్లు పెట్టడంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పిదప అక్మల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సమస్య ఎంటో, అతని శరీరంలో లోపం ఏంటో మాత్రం తమకు అర్థం కావడంలేదని, అసలు మనిషి గుడ్లు పెట్టడం అసాధ్యమని గట్టిగా వాదిస్తున్నారు. అయితే అక్మల్ ఇదివరకే గుడ్లు మింగేసి ఉంటాడని, అవే ఇప్పుడు బయటకు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ అతని తండ్రి మాత్రం తన కొడుకు ఏ గుడ్లు మింగలేదని ,ఒకటి లేదా రెండు నెలలకొకటి చొప్పున ఓ గుడ్డు పెడుతున్నాడని తెలిపాడు. ఆ గుడ్లు పూర్తిగా తెల్లగా గానీ, పసుపు రంగులో గానీ ఉంటున్నాయని ఇదేదో వింత వ్యాధేమొనని, వైద్యులే ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపాలని కోరుతున్నాడు. కాగా ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియా లో వైరల్ గా మారింది…