ఈ సారి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తా…దాని కోసం సీఎం కి కాల్ చేయొద్దు : సుధీర్ బాబు

Friday, June 1st, 2018, 07:21:36 AM IST


సూపర్ స్టార్ కృష్ణ గారి కుమార్తె ప్రియదర్శిని భర్త, మహేష్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు ఎస్ఎమ్ఎస్ చిత్రంతో టాలీవుడ్ తెరకు పరిచయం అయినా విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే మంచి నటనకు కనబరిచిన సుధీర్ బాబు కు ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా చిత్రం మంచి పేరుని తెచ్చి పెట్టింది. అయితే ఆ తరువాత ఆయనకు సరైన విజయం దక్కలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సమ్మోహనం, అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది. నిన్న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయన చేతులమీదుగా ట్రైలర్ విడుదల చేసింది యూనిట్. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో యూనిట్ సభ్యులందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ ట్రైలర్ లోని ఒక సన్నివేశంలో సుధీర్ బాబు హీరోయిన్ ను బైక్ పై ఎక్కించుకుని వెళుతూ ఉంటాడు.

ఆ సీన్లో ఆయనకు హెల్మెట్ ఉండదు. దానిని స్క్రీన్ షాట్ తీసిన ఒక నెటిజన్ ఆ ఫోటో సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ, సుధీర్ గారు మీరు హెల్మెట్ లేకుండా వెళుతున్నారు మీకు ఫైన్ వేయమని సీఎం భరత్ గారికి కాల్ చేసి చెప్తాను అంటూ ఫన్నీగా ట్వీట్ చేసాడు. అయితే భరతే అనే నేను సినిమాలో సీఎం భరత్ ట్రాఫిస్ రూల్స్ పాటించని వారికి ఫైన్ వేయమని చెపుతారు కాబట్టి ఇక్కడ ఆ సందర్భాన్ని ఉపయోగించాడు నెటిజన్. దానికి తన స్టయిల్లో సమాధానమిచ్చిన సుధీర్, సినిమా కోసం తప్పలేదు బ్రదర్, కానీ ఈ సారి మాత్రం ఎప్పుడైనా బైక్ డ్రైవ్ చేసేటపుడు హెల్మెట్ తప్పక ధరిస్తాను, అయితే ఈ విషయంలో మాత్రం సీఎం భరత్ కు మాత్రం కాల్ చేయవద్దు అంటూ చమత్కారిస్తూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది….