క్రికెటర్లను లను తలదన్నేలా..సింధుతో 50 కోట్ల డీల్..!

Tuesday, September 27th, 2016, 12:53:19 PM IST

SINDHU
రియో నుంచి సింధు వెండి పతకంతో తిరిగొస్తే.. ఆమె ఇంట బంగారు పంట పండుతోంది.ఇప్పటికే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సింధుని ఘనం గా సత్కరించి భారీ నగదుని ప్రోత్సకంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల వంతు వచ్చింది.ఒలంపిక్ లో సింధు సక్సెస్ ని, ఇమేజ్ ని కార్పొరేట్ కంపెనీలు ఉపయోగించుకునే పనిలో పడ్డాయి.ఆయా కంపెనీలు తమ ప్రొడక్ట్స్ కు సింధుని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకునేందుకు కోట్ల రూపాయల డీల్ తో ఆమె ఇంటికి క్యూ కడుతున్నాయి.

ఇప్పటివరకు భారత క్రీడాకారులలో క్రికెర్లకు మాత్రమే భారీ ప్రకటన ఒప్పందాలు కుదిరిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా సింధు తో బేస్ లైన్ అనే కంపెనీ క్రికెటర్లను తలదన్నే భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఈ కంపెనీ సింధుతో మూడేళ్లకు రూ.50 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.ఇదే కాక మరో 9 సంస్థలు ఆమెతో ఒప్పందం కుదుర్చుకోవడంలో చర్చలు ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లు సమాచారం. రజత పతకం గెలిచిన తరువాత సింధుతో ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా కంపెనీలు ఉత్సాహంగా ఉన్నాయని బేస్ లైన్ మేనేజిగ్ డైరెక్టర్ మిశ్రా తెలిపారు. మహిళల సంభందిత బ్రాండ్స్ , స్పోర్ట్స్ బ్రాండ్స్ ను ఉత్పత్తి చేస్తున్న పలు కంపెనీలు ఆమెతో చర్చలు జరుపుతున్నాయి.ఈ ఒప్పందంతో ఎండార్స్మెంట్ లో సింధు సానియా, సైనా లను దాటిపోయిందని అంటున్నారు.