నిజంగా అప్పుడు ఆలా చేస్తే ఇప్పుడు పాకిస్థాన్ అనే దేశం ఉండేది కాదు..!

Tuesday, January 24th, 2017, 05:20:18 PM IST

rajeev-gandhi
అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెంట్ ఏజెన్సీ (సీఐఎ) తాజాగా విడుదల చేసిన నివేదిపై ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. పాకిస్థాన్ అణు కార్యకలాపాలతో ఆందోళన చెందిన భారత్ హైడ్రోజన్ బాంబ్ పరీక్షకు సిద్ధమైనట్టు సీఐఎ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. అప్పట్లో భారత్, పాకిస్థాన్ మధ్యలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అప్పటి అమెరికా అధ్యక్షు రోనాల్డ్ రీగన్ రాయబారులను పంపి ఉద్రిక్తలను చల్లార్చాలని అనుకున్నట్టు నివేదికలో తెలిపారు.

అప్పటికి 11 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని, తన తల్లి ఇందిరా గాంధీ పరీక్షించిన హైడ్రోజన్ బాంబ్ కంటే ఎన్నో రేట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబ్ ను రాజీవ్ గాంధీ పరీక్షించాలని అనుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. అప్పటికే భారత్…. పాకిస్థాన్ కంటే అణు సాంకేతికతతో ఎన్నో రేట్లు ముందుంది. మొదట్లో తన తల్లి ఇందిరా గాంధీ చేపట్టిన అణు కార్యక్రమాలను కొనసాగించేందుకు రాజీవ్ ఇష్టపడలేదని, అయితే ఆ సమయంలో పాకిస్థాన్ అణ్వాయుధాల విషయంలో దూకుడుగా వెళ్తున్నట్టు రాజీవ్ కు సమాచారం అందడంతో ఆయన హైడ్రోజన్ బాంబ్ పరీక్షకు సిద్ధమైనట్టు తెలిసింది.

ముంబై సమీపంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో 36 మంది శాస్త్రవేత్తల బృందం హైడ్రోజన్ బాంబ్ ను తయారు చేసిందని సీఐఎ తన నివేదికలో పేర్కొంది. అణ్వస్త్రాల తయారీకి భారత్ వద్ద అప్పటికే కావాల్సినంత ఫ్లుటానియం నిల్వలు ఉన్నాయని ఆ నివేదికలో స్పష్టం చేశారు. ఆ నివేదిక చెప్పినట్టు భారత్ అప్పట్లో పాకిస్థాన్ ఫై హైడ్రోజన్ బాంబ్ వేసి ఉంటె ఈపాటికి ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉండేది కాదేమో. 1.2 కోట్ల పేజీలున్న 9.30 లక్షల డాక్యుమెంట్ లను సీఐఎ ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది.