బంద్ కొనసాగుతున్నా ఆగని పెట్రోల్ ధరలు!

Monday, September 10th, 2018, 12:06:32 PM IST

ఓ వైపు రూపాయి పతనం కారణంగా చమురు ధరల స్పీడ్ రోజురోజుకి ఊహించని విధంగా పెరిగిపోతోంది. చూస్తుండగానే నెంబర్లు మారిపోవడం జనాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని దేశమంతటా రాజకీయ పార్టీలు నిరసనకు దిగాయి. సాధారణంగా భారత్ బంద్ అనగానే ఏ సమస్య అయినా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చమురు కంపెనీలు మంత్రం బంద్ ను ఎంత మాత్రం లెక్క చేయలేదు అని నేడు పెరిగినా ధరలను సూస్తే అర్ధమవుతోంది.

మళ్లీ రోజులాగే ధరలు దూకుడు పెంచాయి. సోమవారం నాడు లీటరు డీజిల్ పై 22 పైసలు పెరుగగా.. లీటరు పెట్రోలుపై 23 పైసలు పెరుగడం అందరిని షాక్ కి గురిచేసింది. ధరలు తగ్గాలని ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు బంద్ లో పాల్గొన్నాయి. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బంద్ ప్రభావం గట్టిగానే పడనుంది. ఇక ప్రస్తుతం ముంబైలో చమురు ధరల విషయానికి వస్తే.. పెట్రోలు ధర రూ.88.12కు, డీజిల్ ధర రూ. 77.32 వద్ద ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.80.73, రూ. 72.83కి పెరగడం గమనార్హం.

  •  
  •  
  •  
  •  

Comments