వైసిపి, టిడిపి మధ్య మరో యుద్ధం !

Saturday, January 20th, 2018, 03:00:30 PM IST

నెల్లూరు లోని జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. జిల్లా పరిషత్ ఆఫీసులో సాగునీటి పై వాడివేడిగా చర్చ జరిగింది, ఆ చర్చలో భాగంగా వైసిపి ఎంఎల్ఏ ప్రతాప్ కుమార్ రెడ్డిని బ్రోకర్ అంటూ టిడిపి ఎంఎల్ సి బీద రవిచంద్ర దూషించడంతో సమావేశంలో ఒక్కసారిగా ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రవిచంద్ర చేసిన వ్యాఖ్యలపై వైసిపి మ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తీరు బాగోలేదని ఎంఎల్ ఏ ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అధికారులు మాట్లాడుతూ ఎంఎల్ ఏ తమ పై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నీటి పంపిణీలో అధికార పార్టీ తీవ్ర వివక్ష చూపుతోందని సర్వేపల్లి ఎంఎల్ ఏ కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడం సాధారణమే అయినా, ఆంధ్రప్రదేశ్ లోని అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి మధ్య మాత్రం అది కొంత శృతిమించుతోందని, ప్రజల సమస్యల పై మాట్లాడవలిన ప్రాజాప్రతినిధులు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ, దుర్భాషలాడుకుంటూ, చివరకు వ్యక్తి గత దూషణలకు దిగుతున్నారని, ఈ విధమైన వాదన రెండు పక్షాలకు మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు…