ఏపీలో సంచ‌ల‌నం.. ఓటుకు నోటుకు మించి.. ఇది ఒక్క ఓటుకు కోటి..!

Wednesday, November 21st, 2018, 08:32:56 AM IST

తెలంగాణ‌లో గ‌తంలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటునోటు ఎలాంటి ర‌చ్చ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఈసారి ఒక్కఓటుకు కోటి ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఏపీ బార్ కౌన్సిల్ చైర్మ‌న్ ప‌ద‌వికి ఓటు వేస్తే కోటి రూపాయ‌లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తున్నారంటూ ఒక వార్త న్యాయ‌వాద వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టేందుకు రాజ‌కీయ నాయ‌కులు ఎలాంటి తాయిలాలు ప్ర‌క‌టిస్తారో అంద‌రికీ తెలిసిందే.

అయితే ఈసారి బార్ కౌన్సిలింగ్ ప‌ద‌వికి ఓటు వేస్తే కోటి రూపాయ‌లు ఇస్తున్నారంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవల జరిగిన ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో దాదాపు 24 వేల మంది న్యాయవాదులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారంఆ క‌లిసి మొత్తం 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు. అయితే ఈ 25 మంది క‌లిసి కొత్త బార్ కౌన్సిల్ కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కౌన్సిల్ చైర్మ‌న్ ప‌ద‌వికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దీంతో ఆ ప‌ద‌వి కోసం ప‌లువురు త‌మ‌కు ఓటు వేస్తే కోటి ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తున్నారు. ఈ విష‌యం ఇప్పుడు తారా స్థాయికి చేర‌డంతో, దీనిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఫిర్యాదు చేస్తూ ప‌లువురు లేఖ‌లు రాశార‌ని తెలుస్తోంది. మ‌రి చంద్ర‌బాబు ఈ ఓటుకు కోటి వ్య‌వ‌హారం పై ఎలా స్పందిస్తారో చూడాలి.