నేరస్థుల వివరాలు చెపితే లక్ష !

Sunday, February 4th, 2018, 01:10:16 AM IST

ఇటీవల కాలం లో హత్యోదంతాలు ఎక్కువ కావడంతో పోలీస్ లు కూడా వాటిని చేధించడానికి ఒకింత శ్రమపడుతూనే వున్నారు. పోలీస్ లు ఎంత చాకచక్యంగా వ్యవహరించినప్పటికీ కొన్ని కేసులు చాలానే సమయం తీసుకోవం మనము చూస్తుంటాం. అందువల్ల కొన్ని విపత్కర కేసుల్లో పోలీసులు కూడా తమదైన రీతిలో నేరస్థులను పట్టుకోవడానికి కొన్ని రకాల బహుమతులు ప్రకటిస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఇటీవల గచ్చిబౌలి బొటానికల్‌ గార్డెన్‌ వద్ద మహిళ హత్యకేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలిని గుర్తించేందుకు ఊహాచిత్రం ఒకటి విడుదల చేశారు. గత నెల 28న మహిళను హోటల్‌ వద్ద చూశామని నలుగురు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు చెప్పిన వివరాల ఆధారంగా ఊహా చిత్రం రూపకల్పన చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు చెబితే రూ. లక్ష బహుమతి ఇస్తామని సైబరాబాద్‌ పోలీసులు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాతైనా నేరస్థుల జాడ లభించే అవకాశం కొంతవరకు ఉంటుందని పోలీసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు…

  •  
  •  
  •  
  •  

Comments