జగన్ కి కలిసొచ్చే కాలం మొదలైందిగా..!

Tuesday, January 9th, 2018, 03:55:56 AM IST

తదుపరి 2019 ఎన్నికల్లో విజయఢంకా మ్రోగించాలనే లక్ష్యంతో వై సి పీ అధినేత జగన్మోహన్ రెడ్డ్డి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే . మధ్యలో ఆయన పాదయాత్రలో కొంత ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసేలా టి డి పీ ఇద్దరు ఎం ఎల్ ఏ ల ను తన వైపుకు లాక్కున్న విషయం విదితమే . ఏమి జరిగినా తన మొక్కవోని ఆత్మ స్థైర్యంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూర్ లో ఆయన పాదయాత్ర జరుగుతోంది . తమకి పట్టున్న కడప, కర్నూల్ జిల్లాల మాదిరిగానే ఇక్కడ కూడా ఆయనకు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు . ఈ క్రమంలో నేడు ఆయన పూతలపట్టు పాదయాత్రలోకలిసొచ్చే ఘటన చోటుచేసుకుంది .

విశాఖ జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ రాజకీయ వేత్త కుంభ రవి బాబు వై సి పి తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఆయన తన అనుచర గణంతో కలిసి వచ్చి జగన్ సమక్షం లో పార్టీ లో చేరారు . రాష్ట్రం ప్రస్తుతం వై ఎస్ జగన్ నాయకత్వం కోరుకుంటుందని , ఆయన ముఖ్యమంత్రి అయితేనే గిరిజనుల సమస్యలు పరిష్కరింపడతాయని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు . ఇది వరకు ఇద్దరు గిరిజన వర్గానికి చెందిన నేతలు పార్టీని వీధి టీడీపీ లో చేరదాంతో కొంత స్తబ్దత నెలకొని ఉండగా, ఇప్పుడు కుంభ చేరికతో కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపించింది . ఇటీవల పార్టీని వీడిన గిడ్డి ఈశ్వరి చేసిన వ్యాఖ్యలు కొంత ఆసక్తిని కూడా రేపాయి. వై సి పి అభ్యర్ధే తమ నియోజకవర్గంలో విజయం సాధిస్తారని ఆమె అన్నారు. దీనికి మరింత బలాన్నిస్తూ ఇప్పుడు అదే గిరిజన వర్గానికి చెందిన నేతే తమా పార్టీలో చేరడం మరింత బలాన్నిచ్ఛే విషయంగా చెప్పుకోవాలి .