మంత్రివర్గంలో ముందుగా 20 మందికే అవకాశం – స్పష్టం చేసిన ఏపీ సీఎం

Friday, June 7th, 2019, 04:00:45 AM IST

ఏపీ కొత్త ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా మొదటి విడతగా కేవలం 20 మందికి మాత్రమే మంత్రులుగా అవకాశం ఇచ్చారు. రెండవ విడతలో మిగతా వారిని ప్రకటిస్తానని జగన్ స్పష్టం చేశారు. అయితే వైసిపి ఎల్‌పి సమావేశం అనంతరం పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈనెల 8 న ఉదయం 11.49 నిముషాలకు ప్రమాణ స్వీకార ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా ఈ మంత్రి వర్గంలో కేవలం ఒక్క కొరుముట్ల శ్రీనివాసులుకు మాత్రం ఫోన్‌ ద్వారా సమాచారం అందిందని ఆయన నియోజకవర్గంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ,మిగతా వివరాలేవీ కూడా ఇంకా వెల్లడవలేదని సమాచారం. అయితే మిగతా ఎమ్మెల్యేలు అందరిని కూడా సరాసరిగా కార్యక్రమానికి రావాలని, అక్కడే సీఎం జగన్ నూతన మంత్రుల పేర్లను ప్రకటించనున్నారని, అప్పటివరకు కూడా అందరు కాస్త సంయమనం పాటించాలని పార్టీ ఆదేశించిందని సమాచారం. కాగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనతో ముందుగానే ఈ ప్రక్రియను త్వరగా పూర్తీ చేయాలనీ అధికారులందరిని కూడా ఆదేశించినట్లు సమాచారం.