పవన్ పై కూడ అదే తరహా దాడికి ప్లాన్ జరిగిందా ?

Sunday, October 28th, 2018, 11:13:53 AM IST

ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న రాజకీయ వాతావరణం ప్రజలకి ఓ పట్టాన అంతుబట్టడం లేదు. జగన్ పై జరిగిన దాడికి కారణం చంద్రబాబు, బీజేపీలు భాద్యులని వైకాపా నేతలు అంటుండగా జగన్ కావాలనే బీజేపీతో కుమ్మక్కై తనపై తానే దాడి చేయించుకుని రాష్ట్రంలో అస్థిరత నెలకొల్పాలని చూస్తున్నట్టు బాబు అంటున్నారు. మరోవైపు అందరి దృష్టీ ఈ దాడి గురించి ఆపరేషన్ గరుడలో కొని నెలల క్రితం చూపిన సినీ నటుడు శివాజీపై పడింది.

ఆయన చెప్పిన ప్రకారమే ఈ దాడి జరగడంతో జనాలకు ఆయన మాటలపై నమ్మకం ఏర్పడుతోంది. ఇనన్లు ఆపరేషన్ గరుడా.. పెరుగు వడ అని లైట్ తీసుకున్న వారు కూడ ఇప్పుడు ఏమో శివాజీ మాటలో నిజముందేమో అంటున్నారు. ఇక తాజాగా మీడియా చర్చల్లో మాట్లాడిన శివాజీ గరుడ ఆపరేషన్ విజయవంతం అయింది కానీ పేషంట్ చచ్చింది అంటూ తెలంగాణలో చోటుచేసుకున్న ఓటుకు నోటు తరహా కేసును గతంలో ఏపీలోని కొత్త నాయకుడిపై ప్రయోగించాలని చూశారని, కానీ అది సక్సెస్ కాలేదని అన్నారు.

ఈ మాటలు వింటే ఏపీలో కొత్త నాయకుడు అంటే అది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ నాలుగేళ్లలో వేగంగా జనాల్లోకి వెళ్ళింది ఆయనే. కాబట్టి ఆయన్ను దెబ్బ తీయడానికి ఆపరేషన్ గరుడలో భాగంగా ఓటుకు నోటు తరహా ప్రయత్నం జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. పవన్ కూడ పలు సందర్భాల్లో తనపై ఎన్నో కుట్రలు జరుగుతున్నాయని బాహాటంగానే చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దీన్నిబట్టి పవన్ ను దెబ్బతీయడానికి కూడ వ్యూహాలు పన్నుతున్నారని స్పష్టమవుతోంది.