పవన్,జగన్ లకు మోడీని ప్రశ్నించే ధైర్యం లేదా..?

Saturday, October 6th, 2018, 10:13:26 AM IST

“ఆపరేషన్ గరుడ” సృష్టికర్త ఇప్పుడు మళ్ళీ తాజాగా వార్తలోకి వచ్చాడు.అప్పట్లో హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ ఒక సంచలనం రేపింది.అప్పడు పెద్దగా పట్టించుకోని టీడీపీ నాయకులు ఇప్పుడు మాత్రం బలంగా నమ్ముతున్నారు.హీరో శివాజీ ఎప్పటి నుంచో గట్టిగా చేస్తున్న డిమాండ్ ప్రత్యేకహోదా.ఇప్పుడు ఈ ప్రత్యేకహోదా అంశంపై వై ఎస్ జగన్ మరియు పవన్ ల మీద శివాజీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు ప్రత్యేకహోదా కోసం ముందు అంతా బలంగా మాట్లాడిన వీరిద్దరూ ఇప్పుడు ఇంత మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో అశేషమైన ప్రజా బలం ఉందని,అప్పట్లో రెండు మూడు సభలు పెట్టి మోడీని ప్రశ్నించిన పవన్ మళ్ళీ ఎందుకు నిలదీయట్లేదు అని కొంతమంది తప్పుడు మాటలు,చెప్పుడు మాటలు విని పవన్ మోసపోతున్నారని తెలిపారు.కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి 74వేల కోట్లు రావాలని చెప్పిన పవన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.

అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మీద మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం మీరు ఎందుకని పట్టించుకోవట్లేదు,ప్రధాన మంత్రి మోడీని ఎందుకని నిలదీయట్లేదు అని ప్రశ్నించారు.ఒక ప్రజల సమస్యలు పట్టించుకోరు,అసెంబ్లీకి రారు అదేంటని ప్రశ్నిస్తే వైసీపీ,జనసేన సోషల్ మీడియాలు తనపై విషం చిమ్ముతున్నాయి అని మండిపడ్డారు.