ఒపీనియన్ పోల్ – బయటపడ్డ పవన్ మాస్టర్ ప్లాన్…

Wednesday, February 13th, 2019, 12:11:29 AM IST

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి తన ద్రుష్టి అంత కూడా రాజకీయాలపైనే పెట్టాడని అందరికి తెలుసు… రానున్న ఏపీ ఎన్నికల్లో పవన్ రాజకీయాల్లో మార్పుకోసమే పోరాడుతున్నట్లు మనకు ఇదివరకే ప్రకటించారు. కానీ ఎన్నికల తరువాత పవన్ వేసుకున్న మాస్టర్ ప్లాన్ కు సంబందించిన సమాచారాన్ని ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ బయట పెట్టింది. ప్రస్తుతానికి అనేక జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఒపీనియన్ పోల్ లో పవన్ కళ్యాణ్ స్తాపించినటువంటి జనసేన పార్టీ కి అసలు 5 శాతానికి మించి ఓట్లు రావని తెలిసిపోతుంది.

అంతేకాకుండా పవన్ ఎన్నికల్లో పోటీ చేయడం వలన ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎరపడిన ఓట్లన్నీ కూడా చీలిపోతాయని, దానివల్ల పవన్ కి ఎలాంటి లాభం లేదని, పలు విశ్లేషకులు అంటున్నారు… అందుకునే పవన్ కాస్త ముందుగానే ఆలోచించి ఎన్నికలపై కసరత్తును మరింత ముఖ్యమ్మరం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో పవన్ గెలిచినా, ఓడిపోయినా కూడా మళ్ళీ సినిమాలపై ద్రుష్టి సారిస్తాడని సమాచారం. అందుకోసం తాను ఒక దర్శకుడుకి మాట ఇచ్చాడని, వారు కూడా పవన్ కోసమే ఎదురుచూస్తున్నారని ఒక పత్రిక తెలిపింది. అంటే… పవన్ మళ్ళీ సినిమాలు తీయడం ఖాయం అని సమాచారం.