కేసీఆర్ ని ఓడించాలంటే అదొక్కటే ఉపాయం ?

Thursday, February 15th, 2018, 03:00:32 AM IST

2019 ఎలక్షన్స్ లో తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్పులే చోటు చేసుకోబోతున్నాయని ఓ సైడ్ నుంచి టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆంద్రప్రదేశ్ లో గట్టి మార్పులే చోటుచేసుకోబోతున్నాయట. ఇప్పటికే జగన్ పాదయాత్రను ఆయుధంగా చేసుకొని పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రజలను ఆకట్టుకోడానికి రెడీ అయ్యాడు. ఇక టిడిపి అమరావతి స్థాపననే ఆయుధంగా చేసుకొని ప్రజల ఉంచి మరో సారి మద్దతు పొందేందుకు ఉవ్విళూరుతోంది. మరి పవన్ జేఎఫ్ సి తో ఎంత వరకు ప్రజలను ఆకర్షిస్తాడో చూడాలి. అయితే ప్రస్తుతం తెలంగాణలో మాత్రం రాజకీయ పోటీ ఎంతవరకు ఉండనుంధో ఎవరు అంతగా ఉహించలేకపోవుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ పార్టీని ఇప్పటికే ప్రజల్లో గట్టిగా పాతుకుపోయేలా చేశారు. టీడీపీ గట్టి పోటీని ఇస్తుందనుకున్న ఆ పార్టీలో పార్టీ ఫిరాయింపులు, ఓటుకు నోటు ఆరోపణలు పెద్ద దెబ్బనే కొట్టాయి.

ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ గెలుస్తామనే నమ్మకంతో ఉన్నా ఏ స్థాయి వరకు పోరాటాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీలో కొందరు నేతలు ఎప్పుడో ఒకసారి మీటింగ్ లకు హాజరవుతున్నారు. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న దాన్ని ప్రజల వరకు తీసుకెళ్లలేకపోతున్నారు. కానీ ఏ పార్టీలో లో లేని టిజేఏసి అధ్యక్షులు కోదండరాం మాత్రం ప్రభుత్వంపై కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన చేసిన ర్యాలీలు, మీటింగ్ లు ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే ప్రస్తుతం ఒక్కరి వల్ల సాధ్యం కాదని సీనియర రాజకీయ విశ్లేషకులు బావిస్తాన్నారు.

కానీ కొందరు ఒక్క ఉపాయం ఉందంటున్నారు. వామ పక్ష పార్టీలో వున్న వీళ్ళందరూ కలిస్తే కేసీఆర్ టీఆరెస్ పార్టీకి వచ్చే ఎలక్షన్ లో గట్టి పోటీనివ్వచ్చు అని అంటున్నారు. అయితే కోదండరాం కూడా మరికొన్ని రోజుల్లో పార్టీని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం రాజకీయా నాయకులను ఇష్టపడని కోదండరాం వారితో చేతులు కలుపుతాడా అనే పెద్ద సందేహమే. ఇక కాంగ్రెస్ కి టీడీపీ కి విభేదాలు చాలా వరకు ఉన్నాయి. కానీ వచ్చే ఎలక్షన్ లో ఎంతో కొంత కేసీఆర్ పై రివెంజ్ తీర్చుకోవాలనే ఆలోచనతో ఉంటె మాత్రం వీరందరూ ఒకటవ్వాల్సిందే. అలా అయితేనే ఎలక్షన్ లో ఎదుర్కోగలరని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే మాత్రం వచ్చే తెలంగాణ ఎలక్షన్స్ లో మాత్రం ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పవచ్చు.

  •  
  •  
  •  
  •  

Comments