శశికళకు కన్నీరు తెప్పించే పనిలో పన్నీరు !

Monday, February 20th, 2017, 10:58:23 AM IST


జయలలిత మరణం తర్వాత, తన ముఖ్యమంత్రి రాజీనామా వరకు కూడా చాలా సౌమ్యుడిగా ఉన్న పన్నీరు సెల్వం ఆ తర్వాత ఒక్కసారిగా శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి శశికళ బందీఖానాతో సగం విజయం సాధించాడు. కానీ శశికళ తన మద్దతుదారులతో ఎడప్పాడి పళనిసామిని సభాపక్ష నేతగా నియమించి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది. దీంతో సగం ఓటమిని చవిచూసిన పన్నీరు ఇప్పుడు మరో విధంగా శశికళపై పంతం నెగ్గే ప్రయత్నంలో ఉన్నారు.

అది కూడా ప్రభుత్వం తాను, తన 10మంది మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై వేస్తున్న పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఆసరాగా చేసుకునే కావడం విశేషం. విశ్వాస తీర్మానం సయమంలో అన్నాడిఎంకె అసెంబ్లీయే విప్ రాజేంద్రన్ తమ పార్టీ సభ్యులంతా అనుకూలంగా ఓటు వేయాలని విప్ జారీ చేసినా పన్నీరు వర్గం వ్యతిరేక ఓటు వేసింది. దీంతో వయారిపై అనర్హత వేటుకు రంగం సిద్ధమైంది. కానీ పన్నీరు వర్గీయులు మాత్రం శశికళ నియామకమే సక్రమంగా లేనప్పుడు ఆమె తరపు ప్రభుత్వం జారీ చేసిన విప్ తమపై పనిచేయదని, అవసరమైతే కోర్టుకు వెళతామని అప్పుడు శశికళ పార్టీలో పదవిని కోల్పోవలసి వస్తుందని అంటున్నారు.