దేశంలో దారుణాలు తెలిస్తే అడ‌వుల‌కు పోతారు!

Saturday, May 12th, 2018, 01:46:52 AM IST

మ‌న దేశంలో ప్ర‌జాస్వామ్యం ఏ తీరున అమ‌ల‌వుతోంది? అస‌లు భార‌త రాజ్యాంగం ప్ర‌జ‌ల‌కు నిజంగానే మేలు చేస్తోందా? ఇప్పుడున్న చ‌ట్టాలు నిజ‌మైన ప్ర‌జ‌ల్ని, అన్యాయాల్ని ఎదుర్కొంటున్న వారికి కాపాడగ‌లుగుతున్నాయా? పేద‌రికంలో మ‌గ్గిపోతున్న బ‌ల‌హీన జ‌నాల్ని బాగు చేస్తున్నాయా? అంటే ఇవ‌న్నీ స‌మాధానం లేని శేష ప్ర‌శ్న‌లు. ఇక అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా ఉన్న ప‌లు కీల‌క శాఖ‌ల్లో అవినీతి అయితే ప‌రాకాష్ట‌లో ఉంది. అధికార పార్టీకి తొత్తుగా ప‌ని చేసి అందిన‌కాడికి దోచుకుని వెళ్లిపోవ‌డ‌మే అధికారుల ప‌ని. న్యాయంగా, నిజాయితీగా జ‌న‌తా గ్యారేజ్‌లో రాజీవ్ క‌న‌కాల లాంటి అధికారులు ఎక్క‌డో కానీ క‌నిపించ‌రు. ఈ దోపిడీ స‌మాజంలో దోపిడీ య‌థేచ్ఛ‌గా సాగిపోతూనే ఉంది. అవినీతిని ఎంత‌గా నిర్మూలించాల‌ని చూసినా, అది అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ, త‌గ్గ‌డం లేదు. అయితే ఈ ప‌రిస్థితికి కార‌ణం దుష్ట రాజ‌కీయాలు, రాజ‌కీయ నాయ‌కుల్లో అవినీతి అస‌లు కార‌ణం.

ముఖ్యంగా పోలీస్ వ్య‌వ‌స్థ‌, న్యాయ‌స్థానాలు, సీబీఐ, సీబీసీఐడీ, ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్.. ఇన్ని కీల‌క శాఖ‌లు పూర్తిగా అధికార పార్టీకి అడుగుల‌కు ఒత్తులు ఒత్తుతూ ప‌బ్బం గ‌డిపేయ‌డ‌మే కార‌ణం. ఆ మాట అంటోంది ఎవ‌రో కాదు లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌. స‌మ‌కాలీన వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా పుక్కిట ప‌ట్టిన మేధావిగా ఆయ‌న సంఘంలో అరాచ‌కాల్ని త‌న‌దైన శైలిలో విశ‌ద‌ప‌రిచారు. అయితే ఇన్ని తెలిసిపోయాయి క‌దా! వీటిని ప్ర‌క్షాళ‌న చేయ‌లేమా? చేసేవాళ్లు లేరా? అన్న సందేహాలొచ్చాయా? అయితే అసలు భార‌తీయ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లోని అవ్య‌వ‌స్థ‌ను కూక‌టివేళ్ల‌తో పెక‌ళించి సౌదీ త‌ర‌హా చ‌ట్టాలు అమ‌లు చేయాల్సి ఉంటుందేమో! అయితే ప్ర‌జాస్వామ్యం అలాంటివి అంగీక‌రించ‌దు! ప్చ్‌!

Comments