న‌ష్ట‌పోయిన‌ది వెన‌క్కిచ్చిన ర‌జ‌నీ

Tuesday, June 5th, 2018, 01:45:11 AM IST


సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ నాటి రోజుల్ల పంపిణీదారులు న‌ష్ట‌పోతే పిలిచి డ‌బ్బు వెన‌క్కి ఇచ్చేవార‌న్న పేరుంది. మంచి మ‌న‌సున్న వాడు కాబ‌ట్టే ప‌రిశ్ర‌మ‌లో ఇన్ని సినిమాల్లో న‌టించ‌గ‌లిగార‌ని చెబుతారు. అయితే ఇటీవ‌ల కొన్ని వ‌రుస ప‌రాజ‌యాలు ర‌జ‌నీ మార్కెట్‌ని దెబ్బ కొట్టాయి. ఆయ‌న క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఆదుకునేందుకు మాత్రం ఎవ‌రూ ముందుకు రాలేదు. ఒకే ఒక్క ఇద్ద‌రు త‌ప్ప‌. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు తిరుప‌తి ప్ర‌సాద్ (ఎన్‌.వి.ప్ర‌సాద్‌), ఇంకొక‌రు దిల్‌రాజు. తిరుప‌తి ప్ర‌సాద్ ఏపీ, సీడెడ్ కొనుక్కుంటే, దిల్‌రాజు కాలాను నైజాంలో రిలీజ్ చేస్తున్నారు. అలా క‌ష్టంలో కాలా చిత్రానికి ఆ ఇద్ద‌రూ చెయ్యేశారు.

కాలా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో తిరుప‌తి ప్ర‌సాద్ మాట్లాడుతూ .. తాను గ‌తంలో ర‌జ‌నీకాంత్ న‌టించిన బాబా చిత్రాన్ని రిలీజ్ చేసి తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌ని, అయితే త‌న‌ను ఆఫీస్‌కి పిలిచి న‌ష్ట‌పోయిన మొత్తాన్ని ర‌జ‌నీ స్వ‌యంగా వెన‌క్కి ఇచ్చార‌ని గుర్తు చేసుకున్నారు. బాబా సినిమాని త‌న ఇష్టానికి తీసుకున్నాన‌ని, డ‌బ్బు పోయేప్పుడు తీసుకుపోతామా? అంటూ వెన‌క్కి ఇవ్వ‌డం గుర్తు ఉంద‌ని.. ఎన్వీ ప్ర‌సాద్ ఎమోష‌న్ అయ్యారు. ఇక‌పోతే .. తిరుప‌తి ప్ర‌సాద్ ఎంతో మంచోడ‌ని ర‌జ‌నీ వేదిక‌పై కితాబివ్వ‌డం విశేషం. ఇక‌పోతే దిల్‌రాజు మాట్లాడుతూ ర‌జ‌నీకాంత్ న‌టించిన `న‌ర‌సింహా` చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేసి ఆరంభ‌మే ప్రాఫిట్స్ తెచ్చుకోగ‌లిగాన‌ని తెలిపారు. మొత్తానికి దిల్‌రాజు సీక్రెట్ ఆ సినిమా స‌క్సెస్ అని కాలా వేదిక సాక్షిగా అర్థ‌మైంది.

  •  
  •  
  •  
  •  

Comments