మా స్వప్నం, మా లక్ష్యం బంగారు తెలంగాణ!

Sunday, September 2nd, 2018, 10:12:57 AM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రగతి మరియు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అధినేత కేసీఆర్. ఎందరో త్యాగధనుల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపుదిద్దడానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని కేసీఆర్ అనేక సార్లు చెపుతూ వచ్చారు. ఇక ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభ ద్వారా ప్రజలకు మరింత చేరువై తాము ఇప్పటివరకు ప్రవేశపెట్టిన పధకాలు, మరియు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు నివేదించనున్నారు. అయితే ఈ సభకు టిఆర్ఎస్ ఎన్నడూ లేనివిధంగా, ఇప్పటివరకు దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసింది. నేడు కొంగరకలాన్ లో జరిగే ఈ సభకు లక్షలాదిగా ప్రజలు అనేక జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలిరానున్నారు.

ఎట్టిపరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కేసీఆర్ ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లను చేసింది. అయితే ఈ సభ ద్వారా తాము ప్రజల వద్దకు ఎంతవరకు చేరువయ్యామనేది తెలుస్తుందని, ముఖ్యంగా ప్రతిపక్షాలు తమ పార్టీమారియు పాలనపై చేస్తున్న నిందారోపణలకు అడ్డుకట్ట పడుతుందని వారు చెపుతున్నారు. అంతేకాదు, తమ అధినేత సహా పార్టీ అధికారాన్ని చేపట్టిన దగ్గరినుండి మా స్వప్నం మరియు మా లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మర్చి ప్రజలకు సురక్షితమైన మరియు ఆనందదాయకమైన పాలన అందించాలన్నదే తమ ద్యేయమని వారు చెపుతున్నారు.

ఇక ఇప్పటికే సభకు వందలాదిగా టిఆర్ఎస్ కార్యకర్తలు మరియు అతిథులు వస్తున్నారని, అందువల్ల పోలీసు భద్రత కూడ మరింత పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు వారు చెపుతున్నారు. ఇటీవల కొన్ని జాతీయ సర్వే సంస్థలు చెపుతున్న లెక్కల ప్రకారం తాము చేపట్టిన సంక్షేమ పథకాలు విరివిగా ప్రజల్లోకి వెళ్లి, మరొక సారి తమ పార్టీకే అధికారాన్ని చేపట్టనున్నారని నివేదికలు వస్తున్నాయని, అయినప్పటికి కూడా ఎక్కడ ఎటువంటి అశ్రద్ధ లేకుండా పార్టీ పరంగా వున్నా చిన్న చిన్న లోపాలను సరిచేసుకుంటూ ముందకు వెళ్తున్నామని టిఆర్ఎస్ పార్టీ నేతలు చెపుతున్నారు. ఈ సభ తప్పకుండ విజయవంతం అయి తమ పార్టీపట్ల ప్రజలు మరింత ఆకర్షితులవుతారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు…

  •  
  •  
  •  
  •  

Comments