మహిళలు అన్నింటా ముందుండేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం : చంద్రబాబు

Wednesday, January 17th, 2018, 01:46:59 PM IST

పురుషులకు సమానంగా మహిళలను అన్ని విధాలా సమాన హక్కులు కల్పించి, మహిళా సాధికారత లక్ష్య దిశగా ముందుకెళ్లాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం లో నేడు అంతర్జాతీయ మహిళా పారిశ్రామిక సదస్సు ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోని ప్రతి మహిళా నెలకి రు. 10 వేలు సంపాదించేలా చేయడమే తమ ప్రభుత్వ ద్యేయమని ఆయన చెప్పుకొచ్చారు. మహిళల పట్ల ఎక్కడా వివక్ష లేకుండా చూస్తున్నామని, మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నారని, వారికి మరింత చేయూత నివ్వడానికి తమ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, ఈ విధంగా మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్న తాము ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచామని ఆయన పునరుధ్ఘటించారు. పారిశ్రామిక అభివృద్ధికి టెక్నాలజీ ఎంతో దోహదం చేస్తుందన్న ఆయన, విశాఖ లో అభివృద్ధిని చేసిన భూమిని ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. కుటుంబం లో స్త్రీలు ఆనందంగా ఉంటే ఆ కుటుంబమంతా అనందంగా ఉంటుందని అన్నారు. ఏది ఏమైనా మహిళల అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని మంచి ప్రశంసలు అందుతున్నాయి…