మన మహనీయులు…స్ఫూర్తి ప్రదాతలు… అందుకోండి మా ప్రణామాలు : పవన్ కళ్యాణ్

Sunday, March 11th, 2018, 09:55:53 PM IST

ఈ నెల 14వ తేదీన గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా టోల్ ప్లాజా దగ్గర జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ ఆవిర్భావ సభ ఆహ్వానానికి సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు. అందులో “మన మహనీయులు స్ఫూర్తిప్రదాతలు అందుకోండి మా ప్రణామాలు” అంటూ గురజాడ అప్పారావు, ఆదిభట్ల నారాయణదాసు, శ్రీ శ్రీ, అల్లూరి సీతారామరాజు, అక్కా సీతమ్మ, సర్ ఆర్ధర్ కాటన్, సత్యనారాయణరాజు, యల్లాప్రగడ సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, పింగళి వెంకయ్య, రఘుపతి వెంకటరత్నం నాయుడు, బూర్గుల రామకృష్ణారావు ఇలా పలువురు మహానీయులను స్ఫురించుకున్నారు. అలానే ‘కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతిని కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం వంటి తమ పార్టీ సిద్ధాంతాలతో ఈ వీడియో రూపొందించి ఆకట్టుకున్నారు. కాగా ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ఈ వేదికపై తెలియచేయనున్నట్లు తెలుస్తోంది…

  •  
  •  
  •  
  •  

Comments