మనపాలకుల మనసులు ఆగ్రహంతో నిండిపోయాయి… రాహుల్ గాంధీ వాఖ్యలు

Saturday, January 12th, 2019, 04:25:12 PM IST

దేశంలో మన రాజకీయ వ్యవస్థ రోజురోజుకి దిగజారిపోతోంది. మనల్ని పాలించే నేతలు అందరుకూడా సరిగ్గా ఉండటంలేదు. వారి మనసులు మొత్తం అసహనం, ఆగ్రహం తో నిండిపోయి ఉందని, అలంటి పాలనను భారతదేశం గత నాలుగున్నర సంవత్సరాలుగా అనుభవిస్తుంది రాహుల్ గాంధీ అన్నారు. దుబాయ్ పర్యటనలో భాగంగా రాహుల్ అక్కడి విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించాడు. ఈ సందర్భంగా భారత్ ఎప్పుడు కూడా తన ఆలోచనలను ప్రజలపైన రుద్ది ఇబ్బంది పెట్టలేదని ఆయన అన్నారు.

రాహుల్ మాట్లాడుతూ ‘భారత్ ఆలోచనలను రూపొందించింది. ఆలోచనలు భారత్ ను రూపొందించాయి. ఇతరుల మాట వినడం కూడా భారత్ ఆలోచనేనని’, ‘సహనం మన సంస్కృతిలో నాటుకుపోయింది. కానీ నాలుగున్నరేళ్లుగా మనం ఎంతో ఆగ్రహం, వర్గాల మధ్య విభేదాలను చూస్తున్నాం. ఇవి పాలకుల మనస్తత్వం నుంచి పుట్టుకొచ్చాయని’, ‘జర్నలిస్టులను కాల్చి చంపే ఇండియాను మనం ఇష్టపడమని, రానున్న ఎన్నికల్లో అలాంటి రాజకీయ నాయకులను గద్దె దించుతామని రాహుల్ గాంధీ అన్నారు.