రానున్న ఎన్నికల్లో మా పార్టీకి 100 సీట్లు వస్తాయి : ఎంపీ కవిత

Wednesday, January 31st, 2018, 10:48:30 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని, ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు నిజామాబాదు ఎంపీ కవిత తెలిపారు. తెలంగాణ సచివాలయం లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ కార్యక్రమం లో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ 100 సీట్లు కైవశం చేసుకుంటుందని దాదాపుగా అన్ని సర్వే లు చెపుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందిన ఒక్కరికైనా పద్మ అవార్డులు రాకపోవడం బాధాకరమని, కాళేశ్వరాన్ని ఒక జాతీయ ప్రాజెక్ట్ గా గుర్తించాలని, కేంద్రం రాష్ట్రానికి చేయవలసింది చాలా ఉందని, పార్లమెంట్ వేదికగా ఈ సారి తెలంగాణ వాణిని గట్టిగా వినిపిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పార్టీ చేయాలి అనే అంశం పార్టీ చూసుకుంటుందని, తాను ఎమ్యెల్యే గా పోటీచేస్తానా, లేక ఎంపీ గా పోటీ చేస్తానా అనేది పార్టీ అధిష్టానం నిర్ణయమన్నారు. మంత్రి హరీష్ రావు ఎంపీ గా పోటీ చేసే అంశం పై తాను స్పందించానన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాల అంశాన్ని ఏజీ కూడా ఆమోదించారని, ఒక పూర్తి విధాన రూపకల్పన తర్వాత కేసీఆర్ సింగరేణి యాత్ర ఉంటుందని ఆమె తెలిపారు. అంతే కాక పవన్ రాజకీయ అరంగేట్రం పై ఆమె వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ కు తెలంగాణ లో ఎక్కడి నుండి అయినా పోటీ చేసే హక్కు ఉందని అన్నారు. ఆయన భవిష్యత్తు ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు . టిజెఎసి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పార్టీ పెడితే స్వాగతిస్తామన్నారు. పసుపు బోర్డు విషయం లో గట్టిగా పోరాడి కేంద్రం లో కదలిక తీసుకొచ్చామన్నారు. ఈ సారి క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ లో మహిళలకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రిని తాను అడుగుతానన్నారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలనుండి తమకు వస్తున్న ఆదరణ చూసే చాలా మంది తమ పార్టీ లో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో చాలా మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీ లో చేరతారని, వలసల వల్ల తమ పార్టీకి వచ్చే నష్టం ఏమిలేదని, ….