కన్నతండ్రే ఆమెను తల్లిని చేసాడు!

Saturday, May 12th, 2018, 02:35:19 AM IST

సభ్యసమాజం సిగ్గుపడేలా ప్రస్తుతం మన దేశంలో సంఘటనలు జరుగుతున్నాయి. కన్నబిడ్డను పదికాలాలపాటు తోడు, నీడనివ్వవలసిన తండ్రి ఆమెను పైశాచికంగా ఒక మృగముకంటె నీచంగా చెరిచి తల్లిని చేసాడు. ఈ ఘటన విన్న వారు ఆ నీచపు తండ్రిపై నిప్పులు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, దక్షిణ కర్ణాటకలోని ఒక మారుమూల ప్రాంతంలో రోజువారీ కూలాలైన ఇద్దరు దంపతులకు ఒక్కగానొక్క కూతురు వుంది. ఆమెను స్థానిక ప్రభుత్వ పాఠశాలకు పంపి రోజు వారిద్దరూ కూలికి వెళ్లి జీవనం సాగించేవారు. ఆ అమ్మాయికి బాగా చదివి కలెక్టర్ అవ్వాలని కోరిక. తల్లితండ్రులు ఎంతో కష్టపడి తనని చదివిస్తున్నారని, పెద్దయ్యాక కలెక్టర్ ని అయి వారిని సుఖపెట్టాలి అనుకుంది. అయితే పడవ తరగతి చదువుతున్న ఆమె పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో స్కూలు మానేసి స్నేహితురాలి ఇంటికి వెళ్ళేది. అయితే ఒకరోజు భరించలేని కడుపు నొప్పి రాగా, ఎలాగో మెల్లగా సర్దుకుంది. అయితే మళ్ళి కొద్దిరోజులకు అదేవిధంగా విపరీతమైన కడుపునొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి తల్లి తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా తల్లికి గుండె ఝల్లు మనే విషయం ఒకటి చెప్పారుడాక్టర్లు.

మీ కూతురు గర్భవతి అని, ఇకనుండి ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంతో ఆ తల్లి ఒక్కసారిగా కుంగిపోయింది. అంతే బాధతో కూతురుకి కడుపు తీసివేయకని డాక్టర్లను అడగ్గా, ఐదవనెల కాబట్టి ఇప్పుడు కుదరదని వారు చెప్పారు. బంధువులకు తెలిస్తే పరువు పోతుంది అని ఆ తల్లి తనలో తానే కుంగిపోయింది. తర్వాత స్థానిక సిడబ్ల్యూ సి నేత సహాయంతో కేసును పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారు. మైనర్ అమ్మాయి కాబట్టి విషయం చైల్డ్ వెల్ఫేర్ సంస్థ వరకు వెళ్ళింది. కాగా ఆమెను కొద్దిరోజులపాటు దూరంగా ఫోస్కో చట్టం క్రింద ఆ రక్షణ కల్పించారు. దూర ప్రాంతంలో ఆ అమ్మాయికి భయం మరింత పెరిగింది. మగ వారిని చూస్తే మరింత భయపడేది, జరిగిన విషయం ఎవరికి చెప్పదు సరికదా ఎప్పుడు ముభావంగా ఉంటూ తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చేది. ఇలా ఉండగా ఒకరోజు ఆమెలో కట్టలు తెంచుకున్న ఆవేశం బయటకు వచ్చి ఒక్కసారిగా నాన్న నాన్న అంటూ అరవసాగింది. అక్కడి వారు తండ్రి కోసం విలవిలలాడుతుంది అనుకున్నారు. అయితే అదేమి కాదు అసలు తనకు గర్భం రావడానికి కారణం తన నీచపు తండ్రే అని చెప్పడంతో ఆమె తల్లితోసహా అక్కడివారందరూ వులిక్కిపడ్డారు.

తండ్రి తనను రోజు చెప్పుకోలేని చోట్ల తడిమేవాడని, అమ్మను ఊర్లు పంపించి తనపై లైంగికంగా పశువులా ప్రవర్తించేవాడని, ఒక్కోసారి అమ్మను ఇంటిబయటపడుకోమని చెప్పి ఇంట్లో తనతోపాటు పడుకుని తనని హింసించేవాడని, పదవతరగతి సమయంలో తల్లికి చెపుతాను అంటే, నువ్వు చెపితే మీ అమ్మను చంపేస్తాను అని బెదిరించేవాడని చెప్పి కన్నీరుమున్నీరు అయింది. అయితే వెంటనే పోలీసులు ఆమె తండ్రిని అరెస్ట్ చేసారు. పలు పరీక్షల తరువాత ఆమె కనబోయే బిడ్డకు ఆమె కన్నా తండ్రే కారకుడని తేల్చారు. అయితే ఎంతో డిప్రెషన్ లో వున్న ఆమెకు అక్కడి వైద్యాధికారులు పలు రకాలుగా కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా ఆ అమ్మాయి వారిని రెండు కోరికలు కోరింది. ఒకటి, తనపై ఇంత పైశాచికంగా ప్రవర్తించిన తండ్రిని చట్టపరంగా శిక్షించాలని, అలానే తాను బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకునేందుకు సాయపడాలని కోరింది. పదవ తరగతి పరీక్షలకు ఇంకా 45 సమయం వుంది. అయితే అప్పటికే అన్ని విధాలుగా మానసికంగా, శారీరకంగా చనిపోయిన ఆ అమ్మాయి అంతకముందు చెప్పిన పాఠాలు కూడా గుర్తులేవని హాల్ టికెట్ కూడా వెనక్కి పంపింది. చివరకు సి డబ్ల్యూ సి అధికారులు స్కూల్ వారితో సంప్రదించి హాల్ టికెట్ తెప్పించారు.

సెంటర్ కూడా దూరం కావడంతో వాళ్ళ వూరులోని పాఠశాలలోనే ఆమెకు సెంటర్ కేటాయించారు. ఆ 45 రోజూలు ఆ అమ్మాయి కష్టపడి చదివింది. అయితే నిండు గర్భిణీ కావడంతో పరీక్షా రాయడం కష్టమైంది. అధికారులు కింద కూర్చుని పరీక్ష రాయొద్దు అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కష్టపడి మూడు గంటలపాటు రోజు అలానే పరీక్ష రాసింది. కాగా మొన్న వెల్లడైన ఫలితాలలో ఆమెకు 360 మార్కులతో ఆమెకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇంకో రెండు వారాల్లో ఆమెకు ప్రసవం కానుంది. తనకు కామర్స్ అంటే ఇష్టమని, ఐఏఎస్ చదివి కలెక్టర్ అవ్వాలని ఆ అమ్మాయి చెపుతోంది. కూతురికి ఈ విధంగా సహాయపడినందుకు ఆ తల్లి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతోంది……..

  •  
  •  
  •  
  •  

Comments