పానిపూరిని బ్యాన్ చేసేశారుగా!

Friday, July 27th, 2018, 07:40:53 PM IST

పానిపూరి అంటే ఈ రోజుల్లో చాలా ఫెమస్ అయ్యింది. గల్లీకో బండి కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే సిటీల నుంచి గ్రామాలకు కూడా ఈ పానిపూరి బండీలు దర్శనమిస్తున్నాయి. అయితే ఇక నుంచి పానిపూరి లు కనిపించవు. బ్యాన్ చేసేస్తున్నారట. మీరు సడన్ గా కంగారు పడకండి. ఎందుకంటే బ్యాన్ చేసేది మన రాష్ట్రాల్లో కాదు. గుజరాత్ వడోదరలో పూర్తిగా పానిపూరిని నిషేదిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇటీవల పానిపూరిల తయారీల్లో కల్తీలు జరుగుతున్నాయని పిర్యాదులు ఎక్కువగా రావడంతో వడోదర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆరోగ్యశాఖ అధికారులు మెయిన్ సిటీలో జల్లెడపట్టారు.

దాదాపు దాదాపు 50 ప్రాంతాల్లోని మూకుమ్మడిగా తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది. చాలా వరకు అపరిశుబ్ర వాతావరణంలో పానిపూరి తయారవుతున్నట్లు గుర్తించారు. పాడైపోయిన పిండితో పాటు కుళ్లిన ఆలుగడ్డలు ఉపయోగించి వాటిని సిద్దంచేసుకుంటున్నారట. ఇక రసాయనాలతో పాటు వినియోగించిన నూనెను వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తయారవుతున్న పానిపూరి తింటే ఆరోగ్యాలు పాడవుతాయని అసలే వర్షాకాలం కావడంతో రోగాల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. అందుకే పానిపూరి ని నిషేధించినట్లు అధికారులు వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments