జగన్ అవుట్.. పవన్ కళ్యాణ్ కు ట్రాఫిక్ క్లియర్..?

Wednesday, September 27th, 2017, 02:30:33 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తరమైన మార్పులు అక్టోబర్ నెలలో చోటు చేసుకోబోతున్నాయి. జగన్ పాదయత్రని ప్రకటించగా, జనసేనాని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ అక్టోబర్ లోనే అని తేల్చేశారు. తెలుగు దేశం పార్టీ కూడా ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. దీనితో ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కరమైన పరిణామాలు చోటుచేసుంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యం లో జగన్ శిబిరం నుంచి వచ్చిన అనూహ్యమైన వార్త హాట్ టాపిక్ గా మారింది. జగన్ తన పాదయాత్ర నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ ప్రజలని చేరుకోవడానికి మరొక కార్యక్రమాన్ని పార్టీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వైసికి నేతలు దానిని జిల్లాల యాత్రగా అభివర్ణిస్తున్నారు. పాదయాత్ర ద్వారా గతంలో వైఎస్ ఆర్, చంద్రబాబు ప్రజల మెప్పు పొందడంలో విజయం సాధించారు.దీనితో జగన్ కి కూడా పాద యాత్ర కలసి వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేసాయి. కానీ అనూహ్యంగా జగన్ పాదయాత్ర నుంచి తప్పుకోవడంతో జనసేనాని పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ వే పై ట్రాఫిక్ క్లియర్ అయిందని అంటున్నారు.

జనసేనాని అక్టోబర్ లో ఎలాంటి కార్యక్రమం ద్వారా ప్రజల్ని చేరుకుంటారనే విషయంలో క్లారిటీ లేదు. కానీ పాదయాత్ర చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు. అందుకే గతంలో దీనిపై పవన్ కళ్యాణ్ స్పదించారు. తనకు పాదయాత్ర చేయాలని ఉన్నా సెక్యూరిటీ సమస్యల వలన ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. తాను కచ్చితంగా అక్టోబర్ లో ప్రజలని చేరుకుంటాని అన్నారు. అది పాదయాత్రల రూపంలో కావచ్చు.. బహిరంగ సభల రూపంలో కావచ్చు అని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. జగన్ డ్రాప్ కావడంతో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే జనసేన పార్టీ మరింతగా కేడర్ ని పెంచుకునే అవకాశం ఉంటుందనేది రాజకీయ నిపుణులు చెబుతున్న మాట. కానీ జనసేనాని పాదయాత్రకు జై కొడతాడా లేదా అనేదే అతిపెద్ద ప్రశ్న..!

  •  
  •  
  •  
  •  

Comments