మ్యూజిక్ మ్యాస్ట్రోకి పద్మ విభూషణ్..ధోనికి పద్మ భూషణ్..!

Thursday, January 25th, 2018, 08:06:54 PM IST

వివిధ కళలు మరియు సామజిక రంగంలో సేవలందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ అవార్డలని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈ ఏడాది కూడా వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. జనవరి 26 న రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని పద్మ అవార్డుని ప్రకటించింది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా కు పద్మ విభూషణ్ ని ప్రకటించింది. ఇళయరాజాతో పాటు గులాం ముస్తఫా ఖాన్, విద్యారంగంలో కృషి చేసిన కేరళవాసి పరమేశ్వరన్ లకు కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించింది.

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ధోనీతోపాటు మరికొందరు ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. బ్యాట్మింటన్ ప్లేయర్, తెలుగు వాడు అయిన శ్రీకాంత్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. మొత్తంగా 85 మందికి కేంద్రం పద్మ అవార్డుని ప్రకటించింది. ఇళయరాజా కు రజినీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు.