వైరల్ వీడియో : ర్యాంప్ వాక్ చేస్తోన్న మోడల్ నెత్తిపై అగ్ని ఎటాక్

Thursday, January 25th, 2018, 06:03:18 PM IST

ఏ సమయంలో ఎలాంటి ఘటనలు ఎదురవుతాయో ఎవ్వరికి తెలియదు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక్కసారిగా చావు మన నెత్తిపై డ్యాన్స్ చేస్తుంది. అయితే ఒక మోడల్ కి కూడా అదే తరహాలో అగ్ని ఒక్కసారిగా చావు భయాన్ని చూపించింది. ఫ్యాషన్ ప్రపంచంలో నిప్పు ఒక్కసారిగా అందరిని భయానికి గురి చేసింది. అసలు వివరాల్లోకి వెళితే.. సాల్వ‌డార్‌లో ప్రతి ఏడాది లాగే అందాల పోటీలను గ్రాండ్ గా నిర్వహించారు.

ఓ మోడ‌ల్ ‘క్వీన్ ఆఫ్ హార్వెస్ట్‌’గా కనిపించడానికి అద్భుతమైన కాస్ట్యూమ్ తో కనిపించింది. అయితే ర్యాంప్ వాక్ పై నడుస్తోన్న సమయంలో పక్కన ఒక వ్యక్తి పట్టుకున్న కాగడా ఆమె నెత్తిపై ఉన్న అలంకరణకు తగిలింది. దీంతో మంట అనే లోపే ఒక్కసారిగా అగ్ని మోడల్ తలను చుట్టేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేశారు. మోడల్ కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిన్న పొరపాటు వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.