ఇండియా అలా చేస్తే ఊరుకునేది లేదు.. పాక్ సంచలన వ్యాఖ్యలు

Monday, February 12th, 2018, 10:34:11 PM IST

అప్పట్లో యూరి ఘటనకు ప్రతీకారంగా భరత సైనికులు పాకిస్తాన్ పై జరిపిన దాడి ప్రపంచ దేశాలను షాక్ గురి చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై మన సైనికులు జరిపిన దాడులు పాక్ సైనికుల గుండెల్లో గుబులు రేపాయి. ఆ దాడిలో కొంత మంది సైనికులు కూడా జరిపారు. ఆ తరువాత పాక్ ఎవరు చనిపోలేదు అని చెప్పినప్పటికీ భారత్ సాక్ష్యాధారాలతో భయపెట్టింది. అయితే అప్పుడు ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతు పలికాయి.

అయితే రీసెంట్ గా సుంజువాన్‌ ఆర్మీ క్యాంపుపై పాక్ ప్రేరేపిత‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు భారత్ ఇటీవల ఆరోపణలను చేసింది. అందుకు తగ్గ ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సైనికులు కూడా సిద్దమవుతున్నట్లు అలాగే స‌ర్జికల్‌ స్ట్రయిక్స్ కూడా మరోసారి చేయబోతున్నట్లు అనుమానాలు చెలరేగుతున్నాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీ ముందే ఆందోళన చెందుతుంది. ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. సరైన విచారణ జరపకుండా ఆరోపణలు చేయడం సరికాదని అనవసరంగా తమపై దాడి జరిపితే ఊరుకునేది లేదని అలాగే మిగతా దేశాలు ఈ విషయంపై స్పందించాలని సపోర్ట్ చేయాలనీ పాక్ తెలిపింది.