ధోని సలహాలు తీసుకుంటే మంచిది..పాక్ మాజీ ప్లేయర్

Wednesday, January 24th, 2018, 02:40:36 PM IST


ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్స్ లలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆటలో ఎన్నో నైపుణ్యాలను చూపిస్తూ జట్టుకు విజయాలను అందిస్తుంటారు అలాంటి వారిలో మహేంద్ర ధోని చాలా ప్రత్యేకం. అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది మాజీ ఆటగాళ్లు కూడా ధోని అద్భుతమైన ఆటగాడు అని పొగిడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతే కాకుండా ధోని నుంచి సలహాలు కూడా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. రీసెంట్ గా పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్ యూసుఫ్ కూడా ప్రస్తుతం పాక్ సారధి సర్ఫరాజ్ ఖన్ కి అదే సలహా ఇచ్చాడు.

నాయకత్వంలో అయినా లేక ఆటలో మెళకువలు అయినా ధోని కి ఫోన్ చేసి సలహాలు కోరాలని చెప్పాడు. అందులో ఎలాంటి తప్పులేదని చెప్పాడు. ఇలా యూనిస్ ఎందుకు చెప్పారంటే. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టి20 లో పాక్ దారుణంగా ఓడిపోయింది. అంతే కాకుండా ఆ మ్యాచ్ లో సర్ఫరాజ్ స్టంప్ అవుట్ అయ్యాడు. అయితే అప్పుడు వికెట్ కాపాడుకోవడానికి సర్ఫరాజ్ తన కాలును క్రీజ్ లో ఉంచుదామని అనుకొని ఫెయిల్ అయ్యాడు. కానీ ఓ మ్యాచ్ లో ధోని అలాంటి అనుభవమే ఎదురైనప్పుడు అస్సలు ఫెయిల్ కాలేదు. అందుకే ధోని సలహా తీసుకోమని చెప్పాడు. ప్రస్తుతం ధోని సర్ఫరాజ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.