తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం : పాకిస్తాన్ ఆర్మీ

Friday, September 7th, 2018, 04:00:53 PM IST

ప్రపంచ దేశాలు ఛీ కొట్టినా ఐక్యరాజ్య సమితి బుద్దిని మార్చుకోవాలని చెప్పినా పాకిస్తాన్ ధోరణి మాత్రం మారడం లేదు. పాము లాంటి ఉగ్రవాదాన్ని పొంచి పోషిస్తూ ఇండియా మీదకు ఉసిగొలుపుతూ గతంలో ఎన్నో దాడులు చేసింది పాకిస్తాన్. అందుకు ధీటుగా ఇండియన్ ఆర్మీ ఇచ్చిన సమాధానంకి పాక్ కి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది. ఇకపోతే రీసెంట్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇండియాను రెచ్చగొట్టే విధంగా వార్నింగ్ లు ఇచ్చారు.

కాశ్మీర్ కు మద్దతు పలుకుతూ రెండు నాలుకల ధోరణనిని చూపించారు. సరిహద్దుల్లో మా సైనికులను చంపడానికి ప్రయత్నిస్తే.. అందుకు ధీటుగా మేము ప్రతీకారం తీర్చుకుంటాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. కాశ్మీర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నాము. స్వాతంత్ర్యం కోసం వారు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. అందుకే సెల్యూట్ చేస్తున్న అంటూ పాకిస్థాన్ లో జరిగిన డిఫెన్స్ డే ఫంక్షన్ లో తెలిపారు. అదే విధంగా కాశ్మీర్ ప్రజలకు తాము తోడుగా ఉంటామని వారు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవని మాట్లాడారు.

  •  
  •  
  •  
  •  

Comments