బౌలింగ్ అంటే ఇది.. కుర్రాడి దెబ్బకు ఆలౌట్!

Friday, March 9th, 2018, 11:09:33 PM IST

క్రికెట్ లో నేటితరం యువ ఆటగాళ్లు చాలా రాటు దేలుతున్నారు. బ్యాట్ తో బౌండరీలే టార్గెట్ చేస్తూ కొందరు రెచ్చిపోతుంటే.. మరికొంత మంది బౌలర్లు బెస్ట్ బౌలింగ్ తో వికెట్స్ విరిచేస్తున్నారు. రీసెంట్ గా పాకిస్థాన్ కుర్రాడు టీ20లో బెస్ట్ పర్ఫామెన్స్ ని చూపించి క్రికెట్ దిగ్గజాల మన్ననలను అందుకుంటున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా శుక్రవారం లాహోర్‌ క్వాలాండర్స్‌ వర్సెస్ ముల్తాన్‌ సుల్తాన్స్‌ మ్యాచ్‌ లో లాహోర్ ఆటగాడు షహీన్‌ అఫ్రిదీ 3.4 ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కు దిగిన ముల్తాన్‌ జట్టు 8 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. అయితే ఆ సమయంలో తన సత్తాను చాటాడు షహీన్. ప్రత్యర్థి జట్టుని 114 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ఫార్మాట్ లో అత్యుత్తమ బౌలింగ్ చేసిన వారిలో ఈ ఆటగాడు నాలుగవ స్థాన్నాన్ని అందుకున్నాడు. ఇంతకు ముందు కేవలం మూడు పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసిన వారిలో హెరాత్‌ – రషీద్‌ ఖాన్‌ – సోహైల్‌ తన్వీర్‌ ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments