క్రమక్రమంగా పెరుగుతున్న టెన్షన్.. పాక్ లో చిక్కుకుపోయిన భారత్ జవాన్..!

Friday, September 30th, 2016, 01:19:45 PM IST

rajnath-singh
నియంత్రణ రేఖ వెంబడి పొరపాటున దాటి వెళ్లిన భారత సైనికుడిని పాక్ బలగాలు అరెస్ట్ చేసినట్లు తేలుతోంది.పాక్ లోని ఓ మీడియా సంస్థ ఓ కథనాన్ని వెలువరించింది. దీనిసారాంశం ఏమిటంటే.. నియంత్రణ రేఖ దాటివెళ్లిన భారత సైనికుల పై పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది భారత్ జవాన్లు మరణించారని చెబుతోంది. అయితే ఈ వార్తలను ఇండియన్ ఆర్మీ కొట్టి పారేసింది.నియంత్రణ రేఖ దాటి వెళ్లి తిరిగి రావడం ఎప్పుడూ జరుగుతూ ఉండే అంశమే అని తెలిపింది.

సైనికుడి అరెస్టుపై సందిగ్దత కొనసాగుతోంది.కొద్దిసేపటి క్రితం కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ అరెస్టైన సైనికుడిని విడిపించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలిపారు.దీనితో సరిహద్దు వెంబడి యుద్దవాతావరణ తీవ్రత పెరుగుతున్నట్లు రక్షణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు.బుధవారం అర్థరాత్రి భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడుల వార్త తెలియగానే పాక్ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరైపోయింది. దీనితో పరువు కాపాడు కోవడం కోసం భారత సైన్యం తమపై దాడులు జరపలేదని కేవలం కొద్దీ సేపు కాల్పులు జరిపారని బుకాయించింది.