ఏవమ్మా పాక్ వనితా..ఇంత చిన్న లాజిక్ మిస్సయ్యావా..!

Monday, September 25th, 2017, 10:59:54 AM IST


ఐక్యరాజ్య సమితి వేదికగా ఓ వార్త బయటకు వచ్చిందంటే అది నిజమా కదా అని తెలుకునేందుకు కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తారు. ఇంత చిన్న లాజిక్ కూడా తెలియని పాక్ దౌత్య వేత్త మలీహా లోధికి ఐక్యరాజ్య సమితిలో స్థానం దక్కడం నిజంగా దురదృష్టకరం. తన సొంత దేశానికి లబ్ది చేకూర్చాలని ఆమె చేసిన ప్రయత్నం ఓకే. కానీ బుర్రలో ఇసుమంతమైనా జ్ఞానం లేనివారిని ఐక్యరాజ్య సమితికి పంపవలసి వచ్చిందంటే పాక్ దుస్థితి అర్థం చేసుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే.. భారత్ పై అబద్దాలు చెప్పడం పాక్ కు ఎప్పుడూ అలవాటే. వాటికి ధీటుగా భారత్ సమాధానం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయ్. కానీ ఈసారి అవసరం లేకుండా..పాక్ కుట్ర ప్రపంచానికి తెలిసింది.

కాశ్మీర్ వివాద లో ఓ మహిళని అడ్డం పెట్టుకుని లబ్ది పొందడానికి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న మలీహా లోది ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో అడ్డంగా బుక్కయ్యారు. తద్వారా పాక్ పరువు మరో మారు మంటగలిసింది. కాశ్మీర్ దాడుల, భారత సైన్యం అకృత్యాలకు ఈ ఫోటో నిదర్శనమని ఆమె గాయాలతో ఉన్న ఓ మహిళ ఫోటోని ఐక్యరాజ్య సమితిలో చూపించారు. నిజానికి ఆ ఫోటోలు ఉన్న మహిళ కాశ్మీర్ కు చెందిన వారు కాదు. ఇజ్రాయెల్ లోని గాజాకు చెందిన మహిళని కాశ్మీర్ మహిళగా చిత్రీకరిస్తూ మలీహా చెప్పిన పచ్చి అబద్దం ప్రపంచం మొత్తం గమనించింది. ఆ మహిళా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాయపపడింది. 17 ఏళ్ల ఆ మహిళా పేరు రావా జొమా. 2014 లో గాజా నగరంపై జరిగిన వైమానిక దాడుల్లో ఆ యువతి గాయపడింది. ఆ యువతి దీన స్థితిని అద్దం పట్టేలా లెవిన్ అనే ఫోటో గ్రాఫర్ ఈ ఫోటోని తీశారు. అందుకు గాను అతడికి అవార్డు కూడా లభించింది.

ఇంతటి హిస్టరీ ఉన్న ఆ ఫొటోని చూపించి భారత్ ను మలీహా ఇరుకున పెట్టాలనుకున్నారు. మలీహా మంద బుద్దితో పాక్ ఇరుక్కుపోయింది. ఇలా బుర్రల్లో జ్ఞానం లేనివారికి ఐక్యరాజ్య సమితి వంటి పెద్ద పదవులను కట్టబెట్టడం ద్వారా పాక్ తనకు తానుగా చిక్కులను కొని తెచ్చుకుంటోంది.

  •  
  •  
  •  
  •  

Comments