పాక్ ఎలెక్షన్స్ : మాజీ క్రికెటరే పాకిస్తాన్ ప్రధాని!

Thursday, July 26th, 2018, 05:52:01 PM IST

పాకిస్థాన్ లో ఎటువంటి విషయం జరిగినా అది హింసావాదం లేకుండా జరగదు అనేది ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుసు. ఇక ప్రస్తుతం ఎన్నాళ్ళనుండో అక్కడి ప్రజలు ఎదురు చూస్తున్న ప్రధాన ఎన్నికలకు సమయం రానే వచ్చింది. ఎన్నో ఉద్రిక్తర కార పరిస్థితులు, ఉగ్రదాడుల మధ్య ప్రస్తుత ఎన్నికలు జరిగాయి. ఇక అక్కడికి ప్రధాన పార్టీల్లో రెండు పార్టీలకు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం కనపడుతున్నట్లు తెలుస్తోంది. వాటిలో ఒకటి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నెలకొల్పిన ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ’ మరియు ప్రఖ్యాత పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నెలకొల్పిన ‘పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ పార్టీ లు. అయితే వీటి రెండిటిలో ఏదో ఒక పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది.

ఒకవేళ ఆ రెండిటిలో ఏ ఒక్కపార్టీకి కూడా సరైన మెజారిటీ రాకపోతే, మరొకపార్టీ అయిన బిలావల్ భుట్టో జర్దారీ కి చెందిన ‘పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ’ కి కింగ్ మేకర్ గా అక్కడ అవకాశం దక్కవచ్చని అభిప్రాయం అక్కడి రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తన్నాయి. ఇక పాక్ జాతీయ అసెంబ్లీ లోని మొత్తం 342 స్థానాల్లో మహిళలకు కేటాయించిన 60, అలానే మైనారిటీలకు కేటాయించిన మరొక 10, వీటికి పరోక్ష ఎన్నికలు జరుగుతాయి. అంటే ఆ 70 తీసివేయగా మిగిలిన మొత్తం దేశవ్యాప్త 272 స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఏపార్టీ అయితే 172 సీట్లు సాధిస్తుందో ఆ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని చూరగొంటుంది అన్నమాట. అయితే పోలింగ్ అనంతరం ఏ ఓట్ల లెక్కింపు ప్రారంభించింది ఎలక్షన్ కమీషన్. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ఏ పార్టీ ఆధిక్యతతో దూసుకుపోతుందో, ఏ పార్టీ వెనుకంజలో ఉందొ ఇప్పటివరకు వున్న వివరాలివిగో…..

 

 

 

పార్టీలు  ఆధిక్యం ఫలితం
ఇమ్రాన్ ఖాన్ (పిటిఐ) 117 0
నవాజ్ షరీఫ్
(పీఎంఎల్ఎన్)
64 0
అసిఫ్ అలీ జర్దారీ
(పీపీపి)
37 0
స్వతంత్రులు , ఇతరులు 36 0
  •  
  •  
  •  
  •  

Comments