భారతీయులను బాధపెట్టాను.. నాకు సహాయం కావాలి : పాకిస్థాన్ ప్లేయర్

Tuesday, April 24th, 2018, 05:16:04 PM IST

హాకీలో తన జట్టుకు ఎన్నో విజయాలు అందించిన పాకిస్థాన్ ఆటగాడు మన్సూర్‌ అహ్మద్‌ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 1989లో భారత్ తో తలపడినప్పుడు మన హాకీ టీమ్ ను ఓడించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. అప్పుడు బాధపడని భారత అభిమానులు లేరు. అయితే ఇండియన్ ఫ్యాన్స్ తనవల్ల ఎంతో బాధపడ్డారని చెప్పిన మన్సూర్‌ అహ్మద్‌ ఇప్పుడు ఆదుకోవాలని సహాయాన్ని అర్దిస్తున్నాడు. గుండెకు సంబందించిన అనారోగ్యంతో బాధపడుతున్న ఈ ఆటగాడికి శాస్త్ర చిక్కిత్స చేస్తే బ్రతుకుతాడని అక్కడి డాక్టర్స్ చెప్పారు.

అయితే అందుకోసం భారత్ లేదా కాలిఫోర్నియా వెళ్లాలని సలహా ఇచ్చారు. మన్సూర్‌ ఇప్పుడు ఇండియా రావాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆ ఆపరేషన్ సక్సెస్ రేట్ చాలా ఉందని పైగా ఖర్చు కూడా తక్కువని తెలిపారు. వెంటనే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ ఈ విషయంపై వెంటనే స్పందించి వీసా మంజూరు చేయాలనీ మన్సూర్‌ కోరుతున్నారు. ప్రస్తుతం అతనికి పంజాబ్‌ ముఖ్యమంత్రి షరీఫ్‌ వైద్యం కోసం లక్ష డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించగా.. మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది ఫౌండేషన్‌ ద్వారా వైద్యానికి అయ్యే ఖర్చు సమకూరుతోంది.