పాకిస్థాన్ మ్యాప్ లో కాశ్మీర్.. స్కూల్ పుస్తకంలో కూడా అదే!

Friday, June 8th, 2018, 11:30:36 PM IST

దాయాది దేశం పాకిస్థాన్ లో నిత్యం భారత్ గురించి ఎదో ఒక ప్రస్తావన రావడం కామన్. ఇక ప్రపంచమంతా భారత్ – పాకిస్థాన్ మధ్య వాతావరణం వేడేక్కుతోందని వార్తలను ప్రచారం చేస్తుంటారు. గిట్టని కొన్ని దేశాలైతే పాకిస్థాన్ మంచిదని సంబోధించడం తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా చైనా అయితే తరచు భరత్ కు వ్యక్తిరేకంగా ఉంటూ పాక్ తో స్నేహం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విషయం పక్కనపెడితే భారత్ ప్రస్తావన పాకిస్థాన్ పాఠశాలలో ఒక్కసారిగా కుదుపు తెచ్చింది.

భారత్ లో ఉన్న కాశ్మీర్ పాకిస్థాన్ మ్యాప్ లో ఉండటం పలు సార్లు తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ సారి ఏకంగా పిల్లలు చదువుకునే పుస్తకాల్లో ముద్రించి ఉండటంతో అక్కడి ప్రభుత్వం వెంటనే స్పందించింది. 2, 4, 5, 7, 8 క్లాస్ లకు సంబందించిన సోషల్ పుస్తకాల్లో పాకిస్థాన్ మ్యాప్ ఉంటుంది. అయితే అందులో కాశ్మీర్ పాక్ భూభాగంలో ఉన్నట్లు ఉంది. అలాగే మరికొన్ని అభ్యంతరకర విషయాలు పుస్తకాల్లో ఉండడం తప్పుబట్టిన అక్కడి ప్రభుత్వం వెంటనే వాటిని మార్చాలను పాటశాలలకు ఆదేశాలను జారీచేసింది. మరికొన్ని పుస్తకాలను నిషేదించాలని కూడా అధికారులు ఆదేశాల్ని జారీ చేశారు. అదే విధంగా పుస్తకాల పబ్లిషర్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.