చ‌క్ర‌బంధంలో పాక్‌.. అన్ని దారులు మూసేసిన‌ట్టే!

Thursday, September 29th, 2016, 10:09:57 AM IST

narendra-modi
దాయాది పాకిస్తాన్‌ని ఎక్క‌డ కొట్టాలో అక్క‌డ కొడుతున్నారు భార‌త ప్ర‌ధాని మోదీ. ఆ దేశంతో ఉన్న బంధాల‌న్నీ తెంచేసేందుకు పిలుపునిచ్చారు. అంతేకాదు అగ్ర దేశాలైన చైనా, అమెరికా మ‌ద్ధ‌తును కూడ‌గ‌ట్టారు. ప్ర‌తిసారీ పాక్ ముష్క‌రులు క‌శ్మీర్‌లో విధ్వంశానికి పాల్ప‌డే అవ‌కాశాన్ని ఇక ఇవ్వ‌ద‌లుచుకోలేదు. మొన్న‌టి ఊరీ ఉదంతంతో భార‌త్ విసిగిపోయింది. అందుకే పాక్‌పై ఏఏ అస్త్రాల్ని సంధించాలో అన్నిటినీ సంధిస్తున్నారు ప్ర‌ధాని. ఇప్ప‌టికే సార్క్ దేశాల్లో పాక్‌ను ఒంట‌రిని చేసేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. అలాగే చైనాతో చెలిమి చేయ‌డం ద్వారా పాక్‌కి చైనా మ‌ద్ద‌తు లేకుండా చేస్తున్నారు. అంతేకాదు పాక్‌లో చైనా పెట్టుబ‌డుల్ని వెన‌క్కి తీసుకునే బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌ను మోదీ అప్ల‌య్ చేశారు. దీంతో ల‌క్ష‌ల కోట్ల‌తో పాక్‌లో చేప‌ట్ట‌నున్న ఓ భారీ కారిడార్ ప్రాజెక్టును చైనా వెనక్కి తీసుకునే పున‌రాలోచ‌న‌లో ప‌డింది. అలాగే పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావ‌రాల‌పై దాడులు చేసేందుకు అమెరికా ఆ ధేశాధ్య‌క్షునిపై ఒత్తిడి పెంచుతోంది. లేదంటే స్నేహం క‌ట్ చేస్తామ‌ని తేల్చి చెప్పేశారు.

ఇక భార‌త్ నుంచి పాక్‌లో ప్రవేశించే సింధు జ‌లాల్లో భార‌త్ వాటా 20 శాతం. ఇన్నాళ్లు స్నేహం పేరుతో పాక్‌కే ఆ నీళ్ల‌న్నీ వెళ్లిపోతున్నాయి. భార‌త్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇక ఆ జ‌లాల్ని అటెళ్ల‌కుండా నిలువ‌రించేందుకు ప్ర‌ధాని ప్లాన్ చేశారు. దీనివ‌ల్ల ఇక పాకిస్తాన్ వ్య‌వసాయం కుదేలైపోయిన‌ట్టే. ఇక గ‌ల్ఫ్ దేశాల‌తో స్నేహం కొన‌సాగించ‌డం ద్వారా పాక్‌ని ఒంట‌రిని చేసే వ్యూహాల్ని ర‌చించారు. దేశం నుంచి ఎగుమ‌తి దిగుమ‌తులు ఆపేసే ప్లాన్‌లో ఉన్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితిలోనూ పాక్‌పై వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచేలా చేశారు. యూరోపియ‌న్ యూనియ‌న్ పాక్ ని ఒంట‌రి అయ్యింది. మ‌నం పాక్‌కు అత్యంత ప్రాధాన్య దేశ హోదా ఇచ్చాం. కానీ పాక్ ఇంత‌వ‌ర‌కూ భార‌త్‌ను అలా గుర్తించ‌లేదు. ఇప్పుడు అది కూడా వెన‌క్కి తీసుకుంటున్నాం. .. ఇన్ని ర‌కాలుగా పాకిస్తాన్‌ని చ‌క్ర‌బంధంలో చిక్కుకునేలా మోదీ ప్లాన్ చేశారు. అదీ మ్యాట‌ర్‌.

  •  
  •  
  •  
  •  

Comments