భారీగా అణ్వాయుధాలను పెంచుకుంటున్న పాకిస్తాన్!

Thursday, September 6th, 2018, 11:02:11 AM IST

ప్రపంచ దేశాలు మొత్తం అభివృద్ధిలో ఎంత ముందుకు వెళుతున్నా కూడా పాక్ మాత్రం అభివృద్ధి కంటే ఎక్కువగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. అదే విధంగా ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధంగా అన్వయుధాలను తయారుచేస్తూ విమర్శలు మూటగట్టుకుంటోంది. ఎన్ని దేశాలు ఆ దేశంపై ఆరోపణలు చేసినా కూడా పాక్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్ పై పలు మార్లు విమర్శలు చేస్తూ అగ్రరాజ్యం అమెరికాపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది.

ఇకపోతే రీసెంట్ గా అమెరికా వెల్లడించిన వివరాల ప్రకారం పాకిస్థాన్ భారీ ఎత్తున అణ్వాయుధ సంపదను పెంచుకుంటోందని తెలుపడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఈ విషయం భారత్ కు పెను ప్రమాదమని కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పాక్ వద్ద 140 నుంచి 150 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్లు గతంలో నిర్ధారణ జరిగింది. అయితే అవి సరిపోనట్టు ఇంకా మరిన్ని అన్వాయుధాలను పాక్ పెంచుకుంటుందట. 2025 నాటికీ 220 నుంచి 250 వరకు వార్ హెడ్స్ పెంచుకునేందుకు పాక్ సిద్ధమవుతోంది. అలా జరిగితే అత్యధికంగా వార్ హెడ్స్ ఉన్న దేశంగా పాకిస్తాన్ ఐదవ స్థానంలో ఉంటుందని అమెరికా ప్రకటనను విడుదల చేసింది.

  •  
  •  
  •  
  •  

Comments