భర్తను మాత్రమే చంపాలనుకుంది..కానీ 12 మంది డెడ్!

Tuesday, October 31st, 2017, 03:52:41 PM IST

ఇష్టం లేని పెళ్లి చేస్తే ఒక ఆడపిల్లకి ఇలాంటి ఆలోచన వస్తుందా అని అందరు షాక్ అయ్యేలా చేసింది ఒక యువతి. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. పాకిస్థాన్ కు చెందిన ఆసియా బీబీ అనే యువతి ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేయడంతో భర్తను చంపాలనుకుంది. కానీ ఊహించని విధంగా భర్తతో పాటు 12 మంది బంధువుల ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోయాయి. మరో 14 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఆసియా బీబీ భర్తని చంపాలని పాలల్లో విషం కలిపి అతనికి ఇచ్చింది. కానీ అతను ఎందుకో తాగలేదు.

ఆ తర్వాత ఆ పాలను ఆమె అత్తగారు తీసుకొని తోడు పెట్టి పెరుగు చేసి తర్వాత లస్సీని చేసింది. కుటుంబ సబ్యులు అందరు ఒకటే చోట చేరడంతో అందరికి లస్సిని పంచారు. దీంతో లస్సి తాగిన కొన్ని నిమిషాలకే 12 మంది ప్రాణాలను విడిచారు. మరో 14 మంది చిక్కిత్స పొందుతున్నారు. మొదట అందరు లస్సిలో బల్లి పడటం వలన ఇలా జరిగిందని అనుకున్నారు. కానీ పోలీసులు లోతుగా విచారించడంతో ఆసియా బీబీ అసలు స్వరూపం బయటపడింది. తనకు నచ్చని పెళ్లిని చేయడం వల్ల భర్తను చంపాలని, ప్రియుడి ఆలోచనతో పాలల్లో విషం కలిపాను అని చెప్పింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.