వీడియో :బాబర్-3 మిసైల్‌ను పరీక్షించిన పాక్…

Friday, March 30th, 2018, 06:00:18 PM IST

పాకిస్తాన్ ఎవరి మీదా ఆధార పడకుండా తమకు తాముగా అణ్వాయుధాలు తయారు చేస్కుంటాం అని ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే జలాంతర్గామి నుంచి అణ్వాయుధాలు మోసుకెళ్లే క్షిపణిని పాకిస్థాన్ పరీక్షించింది. దేశీయ టెక్నాలజీతో తయారు చేసిన ఈ బాబర్-3 మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు పాక్ రక్షణ శాఖ ప్రతినిధి జనరల్ అసిఫ్ ఘఫూర్ వెల్లడించారు. 2010 నుంచి బాబర్ మిస్సైల్ సర్వీసులో ఉన్నది. క్రూయిజ్ మిస్సైల్ అయిన బాబర్‌ను యుద్ధ సమయంలో వినియోగించేందుకు పాక్ దాన్ని డెవలప్ చేస్తోంది. సబ్‌మెరైన్ నుంచి ఈ మిస్సైల్ సుమారు 500 కేజీల బరువున్న అణ్వాయుధాన్ని మోసుకెళ్లగలదు. బాబర్ క్రూయిజ్ మిస్సైల్ సుమారు 450 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. పాక్ నౌకాదళం దీన్ని పరీక్షించింది. ఇవన్నీ మా దేశం మీదకి ఎప్పుడు వచ్చినా వదలడానికి సిద్దంగా ఉన్నట్టు పాక్ వెల్లడించింది.