ఇక అంతా స్వామిదే..ముఖ్యమంత్రిగా ప్రమాణం..!

Thursday, February 16th, 2017, 04:01:04 PM IST


తమిళనాడు 12 వ ముఖ్యమంత్రిగా కొద్ది సేపటిక్రితమే ప్రమాణ స్వీకారం చేసారు. జయమరణం తరువాత అనూహ్య మలుపులు తిరిగిన తమిళ రాజకీయాలు ఓ కిలొక్కి వచ్చినట్లే కనిపిస్తున్నాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు పళనిస్వామి చే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. పళని స్వామి తన కేబినెట్ లోకి 31 మంది మంత్రులను తీసుకున్నారు. జయ కేబినెట్ లో ఉన్న దాదాపు అందరికి మంత్రిపదవులు దక్కడం విశేషం. పన్నీర్ సెల్వం స్థానంలో పార్టీ సీనియర్ నేత సెంగొట్టియాన్ ని తీసుకున్నారు.

తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు కొలువుదీరిన శాసన సభలో 15 రోజుల లోగా బలనిరూపణ చేసుకోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో పళని ప్రభుత్వానికి పన్నీర్ సెల్వం, స్టాలిన్ లనుంచి ముప్పు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పళనిస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్ దర్భార్ హాల్ లో జరిగింది.