బ్రేకింగ్ న్యూస్ : పన్నీర్ సెల్వంకు బిగ్ షాక్.. పళనిస్వామే సీఎం..!

Thursday, February 16th, 2017, 12:34:29 PM IST


తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభానికి ఎట్టకేలకు తెర పడింది.శశికళ ప్రతిపాదించిన పళని స్వామే తమిళనాడు ముఖ్యామంత్రి అయ్యారు. తాను ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్న పన్నీర్ సెల్వంకు, అతని వర్గానికి పెద్ద షాక్ తగిలింది. గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పళని స్వామిని ఆహ్వానించారు. కాగా నేడు సాయంత్రం 4 : 30 గంటలకు పళని స్వామి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ పళని స్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 15 రోజులలోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచించారు. పళని స్వామిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించడంతో శశికళ వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. తమిళనాడు రాష్ట్ర 12 వ ముఖ్యమంత్రిగా పళని స్వామి ప్రమాణ స్వీకారం చేయనుండడం విశేషం. ఆయన 1954 లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1980 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన మొదటి నుంచి అన్నా డీఎంకే పార్టీ లోనే ఉండడం విశేషం. ప్రస్తుంతం ఆయన తమిళనాడు రహదారుల, ఓడరేవుల శాఖా మంత్రిగా ఉన్నారు. ఆయన సేలం డెయిరీ చైర్మన్ నుంచి ముఖ్యమంత్రి వరకు చేరుకోవడం విశేషం. శశికళ జైలు పాలు కావడంతో నిరాశలో ఉన్న ఆమె వర్గీయులకు పళని స్వామి ముఖ్యమంత్రి కానుండడం ఊరటనిచ్చే అంశం.