గాలి పటాల భయం.. అవి వస్తే మరణమే!

Monday, June 18th, 2018, 07:20:01 PM IST

గాలి పటాలు అంటే ఎవరికీ ఇష్టం ఉండవు. ఎగురుతూ ఉంటే ఆనందించే పిల్లలు పెద్దలు వాటిని చూసి బయపడతారా? ఇది ఎక్కడైనా విన్నారా?.. ఇజ్రాయెల్ లో ప్రస్తుతం గాలి పటాలు అంటే ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ కొత్త రకం భయం పాలస్తీనా సృష్టించింది. గత కొంత కాలంగా పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అశాంతి నెలకొంది. అయితే ఇంతకుముందు ఇరు దేశాలు బాంబులతో మిసైల్ లతో దాడులు చేసుకునేవి.

కానీ ఇప్పుడు పాలస్తీనా వాసులు కొత్త తరహా ఆలోచనలతో పగ తీర్చుకుంటోంది. గాలి పటాలను ఎగురవేసి వాటి చివరన అగ్గిని తగిలించి ఇజ్రాయెల్ అడవులపై వదులుతున్నాయి. దీంతో అక్కడి అడవులు కాలి బూడిదవుతున్నాయి. ఆ మంటల వల్ల గ్రామాలూ కూడా తగలబడుతున్నాయి. ఒక్క శనివారం రోజే దాదాపు 10 చోట్ల మంటలు చెలరేగాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. కొన్ని సార్లు బెలూన్ బాంబులను కూడా వదులుతుండడంతో జనాలు ఎప్పుడు ఎలాంటి బాంబు వచ్చి పడుతుందో అని భయంతో బ్రతుకుతున్నారు.