భర్తలంతా జైల్లో..32 మంది భార్యలు గర్భవతులు..ఎలా జరిగిందంటే..?

Tuesday, November 14th, 2017, 04:30:49 PM IST

పాలస్తీనాకు చెందిన వందలాది ప్రజలు ఏళ్లతరబడి ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గిపోతునారు. కాని పాలస్తీనాలో మాత్రం ఓ అద్భతం జరుగుతోంది. భర్తలు జైల్లో ఉన్నా ఇప్పటివరకు 32మంది భార్యలు గర్భవతులు కావడం, పండంటి పిల్లలకు జన్మనివ్వడం జరుగుతోంది. ఇదెలా సాధ్యం అనే ప్రశ్నకు సమాధానం రహస్యంగా జరుగుతున్న స్మగ్లింగ్ కారణం. పిల్లలను కని పోరాట యోధులుగా తీర్చి దిద్దాలనుకున్నభర్తల ఆశలు జైళ్లలో ఉండడం వలన నెరవేరడం లేదు. దీనితో వారంతా ఒక ఆలోచన చేశారు. కుటుంబ సభ్యుల ద్వార రహస్యంగా తమ వీర్యాని భర్తలకు పంపి పిల్లల్ని కనాలి అనుకున్నారు. వారి ఆలోచనతో ఇప్పటి వరకు 32 మంది పాలస్తీనా మహిళలు గర్భవతులు కావడం విశేషం. భర్తల ద్వారా జైలు నుంచే వీర్యాన్ని పొందుతున్న భార్యలు ఐవిఎఫ్ ద్వారా గర్భం దాల్చుతున్నారు.

ఈ వీర్యం స్మగ్లింగ్ 2004 లోనే మొదలైంది. ముష్ తాహా అనే పాలస్తీనా ఖైదికి మొట్టమొదట ఈ ఐడియా వచ్చింది. ఇటీవల ఫాహ్మి అనే ఖైది భార్య ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తన జీవితంలో దీనిని ఆమె మధురమైన క్షణంగా అభివర్ణించింది. ముష్ తాహా కు వచ్చిన ఈ ఆలోచనతో మొదట మిగిలిన ఖైదీలు ఏకిభవించలేదు. మనం మౌనంగా ఉంటె రేపు మన హక్కుల కోసం ఎవరు పోరాడతారు అని అందరిని ఒప్పించాడు. అప్పటి నుంచి తమని చూడడానికి వచ్చిన కుటుంబ సభ్యుల ద్వారా వీర్యాన్ని చేరవేశారు.

Comments