పాన్ కార్డు ఉన్నవారికి హెచ్చరిక!

Sunday, June 10th, 2018, 02:45:44 AM IST

ఆదాయం విషయంలో కేంద్రం చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా బ్యాంక్ ఎకౌంట్స్ నుంచి ఎంతెంత ట్రాన్స్ ఫర్ అవుతుంది అనే విషయాల్లో ఐటి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక మరికొందరు ఒకటి కంటే ఎక్కువ ఫ్యాన్ కార్డులను మెయింటైన్ చేస్తున్నట్లు పసిగట్టిన ఐటి డిపార్ట్మెంట్ అందుకు తాగివున్న చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ముందుగా ఫ్యాన్ కార్డు దారులుకు హెచ్చరిక జారీ చేశారు. ఎవరయితే ఒకటి కంటే ఎక్కువ ఫ్యాన్ కార్డులను మెయింటైన్ చేస్తున్నారో వారు వీలైనంత త్వరగా ఇతర ఫ్యాన్ కార్డులను డిలీట్ చేసుకోవాలని తెలియజేశారు.

ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 272 బీ ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఒక ఫ్యాన్ కార్డు కంటే ఎక్కువ ఉంటే నేరమని దాదాపు 10 వేల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. వెంటనే రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం https://www.incometaxindia.gov.in వెబ్ సైట్ పేజీలోకి వెళ్లి లైఫ్ సైడ్ కింద ఇంపార్టెంట్‌ లింక్స్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చెయ్యాలి. అప్లయ్‌ ఫర్‌ పాన్‌ అనే బటన్‌ క్లిక్‌ చేస్తే..న్యూ పేజ్‌ వస్తుంది. అప్పుడు UTITSL ట్యాబ్‌ క్లిక్‌ చేసి సీఎస్‌ఎఫ్‌ ఫాం.. ఐటెం నెం.11లో రెండో పాన్‌ కార్డు డీటెయిల్స్ ఇస్తే అది పూర్తిగా రద్దవుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments