పందెంకోడి 2 జెన్యూన్ ఫ‌స్ట్ టాక్.. విశాల్ మాళ్ళీ కొట్టాడా..?

Thursday, October 18th, 2018, 09:30:20 AM IST

మాస్ హీరో విశాల్- స్టైలిష్ డైరెక్ట‌ర్ లింగు స్వామి కాంబినేష‌న‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం పందెంకోడి2. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పందెంకోడి సూప‌ర్ హిట్ అవ‌డంతో ఈ చిత్రం పై తెలుగు ప్రేక్ష‌కుల్లో కూడా మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్, వ‌ర‌ల‌క్ష్మీ హీరోయిన్లుగా న‌టించారు. ఇక ఇప్ప‌టికే ప్రివ్యూ షోలు ముగియ‌డంతో సోష‌ల్ మీడియాలో అభిమాను త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేస్తున్నారు. మ‌రి ప‌క్కా మాస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ప‌బ్లిక్ టాక్‌లో చూద్దాం.

పందెంకోడి విశాల్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ లాంటి చిత్రం. అయితే దానికి సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రం ఆ అంచ‌నాల‌ని అందుకోలేక పోయింద‌ని తెలుస్తోంది. పందెంకోడి, పొగరు సినిమాలు కలిపి మిక్స్ చేస్తే.. పందెంకోడి 2 అయ్యిందని… ఇది కేవలం బీసీ సెంటర్స్ మూవీ మాత్రమే సోష‌ల్ మీడియాలో సినిమా చూసిన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యాక్ష‌న్ పార్ట్ ఓవ‌ర్‌గా ఉందని.. డైరెక్ట‌ర్ ఎమోష‌న్స్ కంటే యాక్ష‌న్ పైనే ఎక్కువ‌గా శ్ర‌ద్ద పెట్టాడ‌ని.. విశాల్-కీర్తీల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పెద్ద‌గా ఆకట్టుకోలేద‌ని.. డైలాగ్స్ కూడా పేల‌లేద‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక చివ‌రిగా చెప్పాలంటే ఇది కేవ‌లం బీసీ సెంట‌ర్స్‌కు మాత్రం న‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి పెద్ద‌గా న‌చ్చ‌క‌పోవ‌చ్చని.. విశాల్ గ‌త చిత్రం పందెంకోడిని దృష్టిలో పెట్టుకొని వెళితే మాత్రం నిరాశ త‌ప్ప‌ద‌ని సోష‌ల్ మీడియా ద్వారా ప‌బ్లిక్ త‌మ టాక్‌ను తెలియ‌జేస్తున్నారు.