వీడియో వైరల్ : పాండ్య సింగిల్ హ్యాండ్ క్యాచ్ సూపర్బ్

Wednesday, February 14th, 2018, 11:10:56 PM IST

నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో భారత జట్టు మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో పాండ్య బ్యాటింగ్ లో రానించకపోయినప్పటికీ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ లో మాత్రం అందరిని ఆకట్టుకున్నాడు. 30 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టిన పాండ్య డేంజరస్ బ్యాట్స్ మెన్ ఆమ్లా ను కూడా మెయిన్ టైమ్ లో అవుట్ చేశాడు. సఫారీ బ్యాట్స్ మేన్స్ వరుసగా అవుట్ అవుతుంటే ఆమ్లా మాత్రం పాతుకుపోయాడు.

దీంతో పాండ్య అద్భుతమైన త్రో వల్ల ఆమ్లా రనౌట్ అయ్యాడు. ఇక మరొక క్యాచ్ ని హార్దిక్ పట్టిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం సింగిల్ హ్యాండ్ తో పట్టుకొని వావ్ అనిపించాడు. 42వ ఓవర్లో కుల్‌ దీప్‌ వేసిన ఐదో బాల్ ని శంసి లాంగ్‌ ఆన్‌ మీదుగా గట్టిగా కొట్టాడు. దీంతో గాల్లోకి లేచిన బంతి కోసం పాండ్య-ధావన్‌ రెండు వైపులా పరిగెత్తారు. అందుకునే క్రమంలో ఇద్దరూ డ్యాష్ ఇచ్చుకునేవారు. కానీ ధావన్ తప్పుకోవడంతో పాండ్యా తెలివిగా ఒక్క చేత్తో క్యాచ్ పట్టుకొని అది నాది అనేశాడు