పంజాబ్ దసరా వేడుకల్లో విషాదం..60 మందికి పైగానే మృతి..!

Saturday, October 20th, 2018, 10:12:07 AM IST

ద‌స‌రా వేడుకలు పంజాబ్‌లో విషాదాన్ని నింపాయి. విజ‌య‌ద‌శ‌మి రోజున రావ‌ణ ద‌హ‌నం కార్య‌క్ర‌మంలో భాగంగా పెద్ద ఎత్త‌న బాణాసంచా పేల్చ‌గా.. ఆ నిప్పుర‌వ్వ‌లు ఎగ‌సి జ‌నం మీద ప‌డ‌డంతో వారు ప‌క్క‌నే ఉన్న రైల్యే ట్రాక్ వైపు ప‌రిగెత్తారు. అయితే అదే స‌మ‌యంలో వేగంగా వ‌స్తున్న ట్రైన్ ఢీ కొట్ట‌డంతో దాదాపు 60 మందికి పైగానే ప్రాణాలు కోల్పోగా మ‌రికొంత‌మంది గాయ‌ప‌డ్డారు. దీందో వారిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు.

ఇక పంజాబ్‌లో జ‌రిగిన విషాదం పై ప‌లువురు ప్ర‌ముఖులు స్పందించారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, కాంగ్రెస్ అధ్య‌క్ష‌డు రాహుల్ గాంధీ,, కేంద్ర మంత్రి హోమ్ మంత్రి రాజ్ నాధ్‌తో పాటు ప‌లువురు నేత‌లు దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. అయితే పంజాబ్ మంత్రి న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ, ఆ ప్రాంత ఎమ్మెల్యే ఇద్ద‌రూ అక్క‌డ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇక ఈ ప్ర‌మాదం పై త‌క్ష‌ణ‌మే విచార జరిపించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అక్క‌డి నుండి వెళ్ళిపోవ‌డంతో సిధ్ధూ తీరుపై విమ‌ర్శ‌లు వెలువెత్తుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments