అమ్మని ఒక్కసారి కూడా చూడలేదట..బాంబు పేల్చిన పన్నీర్..!!

Wednesday, February 8th, 2017, 11:31:40 AM IST


ఇప్పటికే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనేక అనుమానాలు నెలకొని ఉన్న తరుణంలో వాటిని మరింత పెంచేలా తాజా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఎప్పుడూ మౌనం వహించి ఉండే పన్నీర్ సెల్వం ఒక్కసారిగా శశికళపై ధిక్కార స్వర వినిపించి అందరిని ఆశ్చర్య పరిచారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టిస్తున్నాయి. తాను ఆసుపత్రిలో అమ్మని ఒక్కసారి కూడా చూడలేదని పెద్ద బాంబే పేల్చారు.గత ఏడాది సెప్టెంబర్ 22 న అనారోగ్య కారణంగా జయలలిత చేనై లోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.దాదాపు రెండు నెలలకు పైగా అమ్మ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ నేపథ్యం అమ్మకు జరిగిన చికిత్సలోఏదో కుట్ర జరిగిందని అమ్మ అభిమానులు భావిస్తున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా ఈ అనుమానాలను లేవనెత్తారు.

ఈ అనుమానాలన్నింటికీ పన్నీర్ వ్యాఖ్యలు ఒక్కసారిగా ఊపిచ్చాయనే చెప్పాలి. జయ ఆసుపత్రిలో ఉన్న సమయంలో జయలలితని చూడనివ్వకుండా అడ్డుకున్నారని అది తన దురదృష్టమని కూడా పన్నీర్ వ్యాఖ్యానించడం విశేషం. జయ అనారోగ్యానికి గురైనప్పుడు తనకేమైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని అమ్మ తనని చేతులు పట్టుకుని మరీ కోరినట్లు పన్నీర్ తెలిపారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల వెనుక ఓ శక్తి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తనచే శశికళ వర్గీయలు బలవంతగా రాజీనామా చేయించారని పన్నీర్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పార్టీ నిర్ణయించిన తరుణం లో అపోలో వైద్యులు జయ మరణం పై వివరణ ఇవ్వడం, నిన్న శశికళ వ్యతిరేకవర్గం లోని కొందరు నాయకులూ మాట్లాడుతూ అమ్మని పోయెస్ గార్డెన్ నుంచి కిందకు తోసేయడం వల్లనే ఆమె అనారోగ్య పాలైందని ఆరోపించడం, తాజాగా తాను ఆసుపత్రిలో అమ్మని చోడనేలేదని వ్యాఖ్యానించడం వంటి పరిణామాలన్నీ గమనిస్తూంటే అమ్మ మరణం వెనుక అనుమానాలు నిజమే అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.